AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత తరుగు పోతుంది? ఎవ్వరికి తెలియని ఛార్జీల సీక్రెట్ ఇదే.!

Gold Jewellery: చాలామంది తాము కొన్న ధరే తిరిగి వస్తుందని ఆశిస్తారు. కానీ అది జరగదు. ఎందుకంటే నగ కొనేటప్పుడు మీరు కట్టిన మజూరీ, జీఎస్టీ (3%) తిరిగి రావు. అలాగే రిఫైనింగ్ ఛార్జీలు: పాత నగలను కరిగించేటప్పుడు అందులోని మలినాలను..

Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత తరుగు పోతుంది? ఎవ్వరికి తెలియని ఛార్జీల సీక్రెట్ ఇదే.!
Gold Jewellery Making Charges
Subhash Goud
|

Updated on: May 09, 2026 | 1:23 PM

Share

Gold Jewellery: భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. శుభకార్యాలన్నా, పండగలన్నా బంగారం కొనడం మన ఆచారం. అయితే, చాలామంది ముడి బంగారం కొని ఇష్టమైన డిజైన్లలో నగలు చేయించుకుంటారు. కానీ, నగ తయారయ్యాక మనం కొన్న బంగారం కంటే తక్కువ బరువు రావడం చూసి కంగారు పడుతుంటారు. అసలు ఈ తరుగు (Wastage), మజూరీ (Making Charges) లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!

22 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి?

మనం నగలు చేయించుకునేది 22 క్యారెట్ల (916) బంగారంతో. అంటే ఇందులో 91.6% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 8.4% రాగి లేదా ఇతర లోహాలను కలుపుతారు. అలా కలిపితేనే బంగారానికి గట్టిదనం వస్తుంది. అలాగే నగలు విరిగిపోకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

తరుగు (Wastage) ఎంత పోతుంది?

నగలు తయారు చేసే ప్రక్రియలో కటింగ్, పోలిషింగ్, వెల్డింగ్ వంటి పనుల వల్ల కొంత బంగారం వృథా అవుతుంది. దీనినే ‘తరుగు’ అంటారు.

  • సాధారణ డిజైన్లు: ఉంగరాలు, గొలుసులు వంటి వాటికి 5% నుండి 8% వరకు తరుగు ఉంటుంది.
  • క్లిష్టమైన డిజైన్లు: కుందన్ వర్క్, స్టోన్ వర్క్, మీనాకారి వంటి హెవీ డిజైన్లకు 10% నుండి 15% వరకు తరుగు పోవచ్చు.
  • లెక్క: మీరు 10 గ్రాముల బంగారం ఇస్తే సుమారు 1 నుండి 1.5 గ్రాముల బంగారం తరుగు రూపంలో తగ్గిపోతుంది.

మజూరీ, ఇతర ఛార్జీలు

నగను తయారు చేసినందుకు కళాకారులకు ఇచ్చే కూలీనే ‘మజూరీ’. ఇది గ్రాముకు ఇంత అని లేదా నగ మొత్తం ధరపై కొంత శాతంగా లెక్కిస్తారు. మెషీన్ మేడ్ నగలకు మజూరీ తక్కువగా, హ్యాండ్ మేడ్ నగలకు ఎక్కువగా ఉంటుంది.

నగలు అమ్మేటప్పుడు వచ్చే ధర ఎంత?

చాలామంది తాము కొన్న ధరే తిరిగి వస్తుందని ఆశిస్తారు. కానీ అది జరగదు. ఎందుకంటే నగ కొనేటప్పుడు మీరు కట్టిన మజూరీ, జీఎస్టీ (3%) తిరిగి రావు. అలాగే రిఫైనింగ్ ఛార్జీలు: పాత నగలను కరిగించేటప్పుడు అందులోని మలినాలను తీసేందుకు 2% నుండి 5% వరకు రిఫైనింగ్ ఛార్జీలు కట్ చేస్తారు. నగలపై ఉన్న రాళ్లు, పూసల బరువును తీసేసి కేవలం నికర బంగారానికి మాత్రమే ధర చెల్లిస్తారు. బంగారం కొనేటప్పుడు కేవలం గ్రాము ధరనే కాకుండా.. తరుగు, మజూరీ ఎంత వేస్తున్నారో ముందే అడిగి తెలుసుకోవడం వల్ల మీరు నష్టపోకుండా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!

ఇది కూడా చదవండి:Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us