Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!
Air Cooler: సమ్మర్ సీజన్‌లలో ఎయిర్ కూలర్ల వాడకం పెరిగిపోతుంటుంది. అయితే వాడుతుండగా, కూలర్ నుంచి చేపల వాసన వస్తుంటుంది. వాసన పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కూలర్ నీటిలో ఎప్పుడూ డిటర్జెంట్ పౌడర్లు లేదా ఘాటైన కెమికల్స్ వేయకండి. ఇవి కూలర్ మోటార్‌ను..

Air Cooler: ఎండల తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు మనందరం ఎయిర్ కూలర్లను వాడుతుంటాము. అయితే, కొన్నిసార్లు కూలర్ ఆన్ చేయగానే గది అంతా ఒక రకమైన ‘చేపల వాసన’ లేదా మురికి వాసన వస్తుంటుంది. ఇది కూలర్ ఇచ్చే హాయిని కాస్తా అసౌకర్యంగా మారుస్తుంది. దీనికి ప్రధాన కారణం కూలర్ ట్యాంక్‌లో నిలిచిపోయిన పాత నీరు, గడ్డి (ప్యాడ్స్) లో చేరిన బ్యాక్టీరియా, పేరుకుపోయిన మురికి.
ఈ దుర్వాసనను పోగొట్టి మీ కూలర్ నుండి తాజా గాలి వచ్చేలా చేసే సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- క్రమం తప్పకుండా నీటిని మార్చండి: చాలా రోజులుగా కూలర్ ట్యాంక్‌లో అలాగే ఉన్న నీటిలో ఫంగస్, బ్యాక్టీరియా చేరి దుర్వాసన మొదలవుతుంది. కాబట్టి ముందుగా పాత నీటిని పూర్తిగా తీసేసి, ట్యాంక్‌ను శుభ్రం చేసి కొత్త నీటిని నింపండి. దీనివల్ల చాలా వరకు వాసన తగ్గిపోతుంది.
- కూలర్ ప్యాడ్స్ (గడ్డి) మార్చడం లేదా శుభ్రం చేయడం: కూలర్ గడ్డి పదే పదే తడవడం, ఆరడం వల్ల అందులో ధూళి పేరుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. వీలైతే ప్రతి సీజన్‌లో కొత్త ప్యాడ్స్ వాడటం మంచిది. ఒకవేళ వెంటనే మార్చడం కుదరకపోతే, వాటిని తీసి మంచి నీటితో శుభ్రంగా కడిగి, కాసేపు ఎండలో ఆరబెడితే బ్యాక్టీరియా నశిస్తుంది.
- ‘వైట్ వెనిగర్’: వైట్ వెనిగర్ (White Vinegar) అద్భుతంగా పనిచేస్తుంది. కూలర్ ట్యాంక్ నిండా నీరు పోసిన తర్వాత, అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వెనిగర్ వేయండి. ఇది సహజమైన డియోడరైజర్‌గా పనిచేసి, బ్యాక్టీరియాను అరికడుతుంది. ట్యాంక్‌లోని మొండి వాసనలను తొలగిస్తుంది.
- కూలర్ పర్ఫ్యూమ్స్ లేదా సహజ సువాసనలు: మార్కెట్లో ఇప్పుడు ప్రత్యేకమైన కూలర్ పర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా, సహజంగా ఉండాలంటే నీటిలో కొన్ని నిమ్మ తొక్కలు లేదా వేప ఆకులు వేయవచ్చు. ఇవి మంచి వాసన ఇవ్వడమే కాకుండా క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తాయి.
ముఖ్య గమనిక:
కూలర్ నీటిలో ఎప్పుడూ డిటర్జెంట్ పౌడర్లు లేదా ఘాటైన కెమికల్స్ వేయకండి. ఇవి కూలర్ మోటార్‌ను పాడు చేయడమే కాకుండా, గాలి ద్వారా మీ ఆరోగ్యానికి కూడా నష్టం కలిగించవచ్చు.
ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!
