తినే ముందు.. మామిడి పండ్లను నీళ్లల్లో ఎందుకు నానబెట్టాలి?
10 May 2026
TV9 Telugu
TV9 Telugu
మర్కెట్లో రకరకాల రంగుల్లో ఆకర్షించే మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం. వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు
TV9 Telugu
నిజానికి.. మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొంతమంది మాత్రం ఈ పండు తింటే వేడి చేస్తుందని, ఇందులో అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఉంటాయని.. వీటిని పూర్తిగా దూరం పెడతారు
TV9 Telugu
ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం మంచిదట. నిజానికి మామిడి పండ్లలో ‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ‘బి6’ విటమిన్లతో పాటు ఫోలేట్.. వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే
TV9 Telugu
ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు
TV9 Telugu
ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట పాటైనా నీటిలో నానబెట్టాలట. వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు
TV9 Telugu
దీనివల్ల కొంతమంది శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. అయితే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెడితే.. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
మామిడి పండ్లు త్వరగా పండడానికి వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇలా వాడిన రసాయనాల ప్రభావం పండు తొక్క పైన ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
ఈ క్రమంలో- వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకొని తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం! అందుకే తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు నిపుణులు