AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ ఇక దశ తిరిగినట్లే.. ఈ రాశుల వారికి శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, 11వ స్థానం బలంగా ఉన్నందున మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి రాబోయే 15 రోజుల్లో శత్రు, రోగ, రుణ బాధల నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. గ్రహ సంచారాల అనుకూలతతో అనారోగ్యాలు తగ్గి, ఆర్థిక సమస్యలు తొలగి, ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ ఆరు రాశుల వారికి మానసిక ప్రశాంతత, వృత్తి వ్యాపారాల్లో విజయాలు చేకూరుతాయి.

అబ్బ ఇక దశ తిరిగినట్లే.. ఈ రాశుల వారికి శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2026 | 8:16 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పదకొండవ స్థానాన్ని బట్టి శత్రు, రోగ, రుణ సమస్యల గురించి చెప్పాల్సి ఉంటుంది. జాతక చక్రంలో 11వ స్థానం బలంగా ఉన్న పక్షంలో ఈ సమస్యలు బాధించే అవకాశం ఉండదు. ఆరవ స్థానం శత్రు, రోగ, రుణాలను సూచించేది కాగా, 11వ స్థానం వాటి నుంచి విముక్తిని సూచిస్తుంది. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా రాబోయే 15 రోజుల కాలంలో మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ఈ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  1. మేషం: ఈ రాశికి 11వ స్థానంలో రాహువు సంచారం వల్ల కొద్ది రోజుల్లో ఈ రాశివారు అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడే సూచనలున్నాయి. రాహువు వల్ల అనుకోకుండా, ఆకస్మికంగా అనారోగ్యాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి, ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉన్నందువల్ల మరో 15 రోజుల కాలంలో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయట పడే అవకాశం ఉంది. ఈ నెల 15 తర్వాత వీరు ప్రత్యర్థులు, పోటీదార్ల మీద కూడా పైచేయి సాధిస్తారు.
  2. వృషభం: ఈ రాశికి 11వ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ నెల 14 తర్వాత ఈ రాశివారికి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యానికి తగ్గ చికిత్స లభించే అవకాశం ఉంది. శుక్ర, గురుల అనుకూలత వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం వల్ల 15 తర్వాత ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ దార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రత్యర్థులు దాదాపు పూర్తిగా వైదొలగే అవకాశం ఉంది.
  3. మిథునం: ప్రస్తుతం కుజ, బుధ, రవి గ్రహాలు ఈ రాశికి 11వ స్థానంలో వరుసగా సంచారం చేస్తున్నందువల్ల అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. సరైన వైద్యుడు, సరైన వైద్యం లభిం చడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మరి కొద్ది కాలం పాటు 11వ స్థానం బలంగా ఉంటున్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా మటుమాయం అవుతాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.
  4. తుల: ఈ రాశికి 11వ స్థానం మీద శుభ గ్రహాల దృష్టి ఉండడంతో పాటు, ఆరవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి దీర్ఘకాలిక అనారోగ్యాల బాధ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సరైన చికిత్సా సౌకర్యాల వల్ల రోగ బాధ తగ్గుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద, ఉద్యోగంలో ప్రత్యర్థుల సమస్య పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి 11వ స్థానం మీద రాశ్యధిపతి గురువు, కుజుల దృష్టి ఉండడంతో పాటు ఆరవ స్థానంలో ఆరవ స్థానాధిపతి శుక్రుడి సంచారం వల్ల అనారోగ్యాలకు అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గురు దృష్టి కారణంగా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయంవృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కెరీర్ పరంగా శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
  6. మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురు సంచారం, రాశ్యధిపతి శని అనుకూలత, 11వ స్థానం మీద బుధ, శుక్రుల దృష్టి కారణంగా అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. శని, శుక్రుల అనుకూల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రుణ భారానికి అవకాశం ఉండదు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us