AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!

Parivartan Yoga: జూలై 26 నుంచి 28 వరకు గురు–చంద్రుల మధ్య ఏర్పడుతున్న రాశి పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి విశేష శుభ ఫలితాలను అందించే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, కుటుంబం, అదృష్టం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!
Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 4:55 PM

Share

శుభ గ్రహాల మధ్య ఎప్పుడు రాశి పరివర్తన జరిగినా కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. జీవితంలో కలలో కూడా ఊహించని విశేషాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(జూలై) 26, 27, 28 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన కూడా అటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులకు పునాదులు వేస్తాయి. మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకు ఈ మూడు రోజులు అత్యంత లాభదాయక రోజులవుతాయి.

మేషం

ఈ రాశికి చతుర్థ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం అత్యంత శుభప్రదం. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ముఖ్యంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి.

మిథునం

ఈ రాశికి ధన, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబపరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కన్య

ఈ రాశికి చతుర్థ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, శుభకార్యాలకు అవకాశాలు కలగడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూ లంగా పరిష్కారమవుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి.. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

తుల

ఈ రాశికి తృతీయ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృశ్చికం

ఈ రాశికి ధన, భాగ్యాధిపతులైన గురు, చంద్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగంతో పాటు కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ఉద్యోగులు, నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది.

మీనం

ఈ రాశికి పంచమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం చాలా గొప్ప విశేషం. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర అదనపు ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

(గమనిక: జ్యోతిష్యం విశ్వాసాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. ఈ వివరాలను నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన సమాచారంగా మాత్రమే పరిగణించాలి)

Follow Us