AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్ర మంగళ యోగం: ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం..! మీ రాశి ఉందా?

Chandra Mangala Yoga: జూలై 24 నుంచి 26 వరకు ఏర్పడుతున్న చంద్ర మంగళ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, స్థిరాస్తి సమస్యలు పరిష్కారం కావడం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ యోగం అనుకూలంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 4:25 PM

Share
చంద్ర, కుజుల మధ్య యుతి జరిగినా, పరస్పర వీక్షణ చోటు చేసుకున్నా కొన్ని రాశుల వారికి తప్పకుండా ఏదో విధంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. గ్రహచారంలో ఈ యోగం ఏర్పడితే కొన్ని రాశులకు దారిద్ర్యం అంటదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ యోగం పడితే తప్పకుండా సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తులు సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఈ నెల(జూలై) 24, 25, 26 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలోనూ, కుజుడు వృషభ రాశిలోనూ సంచారం చేయడం వల్ల పరస్పర వీక్షణ ఏర్పడి చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి అనేక విదాలుగా అదృష్టాలు కలుగుతాయి.

1 / 7
వృషభం: ఈ రాశిలో ఉన్న కుజుడికి, సప్తమంలో ఉన్న చంద్రుడికి పరస్పర వీక్షణ ఏర్పడడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, వడ్డీ వ్యాపారం విజయాలు సాధించడం వంటివి జరు గుతాయి. బంధువుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

2 / 7
కర్కాటకం: ఈ రాశికి అయిదవ స్థానంలో పడుతున్న చంద్ర, మంగళ యోగం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు అభివృద్ధి చెందు తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల వైపు నుంచి కూడా ఆదాయం లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

3 / 7
సింహం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ ధన యోగం ఏర్పడుతున్నందువల్ల, అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని ఇళ్లు, స్థలాలు, పొలాల మీద పెట్టు బడిగా పెట్టడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల ద్వారా అంచనాలకు మించి సంపాదించే సూచనలు కూడా ఉన్నాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రతిఫలం దక్కుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

4 / 7
వృశ్చికం: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని సప్తమం నుంచి రాశ్యధిపతి కుజుడు వీక్షించడం వల్ల అప్రయత్న ధన లాభానికి, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీతభత్యాల పరంగా కూడా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. ఆదాయంలో కొంత భాగాన్ని రహ స్యంగా దాచడం, వడ్డీలకు తిప్పడం, వ్యాపారాల్లో మదుపు చేయడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది.

5 / 7
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడితో లాభాధిపతి కుజుడికి పరస్పర దృష్టి ఏర్పడడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ మదుపులు, పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. అదనపు ఆదాయంతో వడ్డీ వ్యాపారాలు చేయడం, షేర్లు కొనడం, భూముల మీద పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది.

6 / 7
మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడిని కుజుడు వీక్షించడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అయ్యే అవకాశం ఉంది. అతి రహస్యంగా సంపాదించడం, అతి రహస్యంగా దాచేయడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడులు పెట్టే సూచనలు కనిపిస్తు న్నాయి. ఎక్కువగా స్థలాలు కొనే వీలుంది. ధన సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారిపోతుంది.

7 / 7
Follow Us