AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Yoga: శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

శుక్రుడు సింహరాశిలో సంచరిస్తూ కేతువుతో యుతి కావడంతో కొన్ని రాశుల వారికి సతీమణి ద్వారా అదృష్టం కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, కుంభ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలకు అవకాశముంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ సంతోషాలు కలిగే అవకాశం ఉంది.

Shukra Yoga: శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Shukra YogaImage Credit source: AI
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2026 | 5:20 PM

Share

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు సతీమణికి కారకుడు. ఈ గ్రహ స్థితిగతులను బట్టి సతీమణి అదృష్ట దురదృష్టాల గురించి చెప్పాల్సి ఉంటుంది. శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో సతీమణికి తప్పకుండా అదృష్టం పడుతుంది. సతీమణి వల్ల యోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ఆగస్టు మొదటి వారం వరకు సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, కేతువుతో యుతి చెందినందువల్ల భార్యకు సంబంధించి కొన్ని రాశులవారి జీవితాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, కుంభ రాశులకు ఇవి అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశికి కళత్ర స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో యుతి చెందడం వల్ల దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సతీమణి వైపు నుంచి ఆస్తి గానీ, ధనం గానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. సతీమణితో ఉన్న వివా దాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. సతీమణికి అనేక మార్గాల్లో ఆర్థిక లాభం కలుగు తుంది. భార్యకు వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారి కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యం చేసే అవకాశం ఉంది. సతీమణి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. సతీమణికి ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడు కేతువుతో కలిసి సంచారం చేయడం వల్ల కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. భార్యతో ఎటువంటి సమస్యలున్నా ఊహించని విధంగా పరి ష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సతీమణి గుర్తింపు పొందుతారు. శుభ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  4. సింహం: ఈ రాశిలో శుక్ర, కేతువుల సంచారం వల్ల భార్యతో ఉన్న సమస్యలు, ఇబ్బందులు బాగా తగ్గు ముఖం పడతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిర త్వం లభించడం, శీఘ్ర పురోగతికి అవకాశాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితంలో వీరి పేరు ప్రఖ్యాతులు బాగా విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తుల: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల ఈ రాశివారి సతీమణికి ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. సతీమణికి ఉద్యో గంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయాన యోగం కలుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి.
  7. కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు కేతువుతో కలిసి సంచారం చేయడం వల్ల కుటుంబంలోనూ, వైవాహిక జీవితంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంపత్య జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామి వల్ల ఈ రాశివారికి అదృష్టాలు కలుగుతాయి. కుటుం బంలో ఎలాంటి సమస్యలు, విభేదాలున్నా తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సంతాన యోగం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.

(Disclaimer: వెండి లాకెట్/చంద్రుడిని ధరించడం భారతీయ సంప్రదాయంలో భాగమైన ఒక విశ్వాసం. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. కాబట్టి, దీన్ని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక సాంప్రదాయ ఆచారంగా మాత్రమే పరిగణించాలి.)

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు