AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..!

జీవితంలో ఆస్తిపాస్తులు, డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామిని కూడా చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. అందుకే మంచి జీవిత భాగస్వామి దొరకడం కూడా అదృష్టంలో భాగమేనని అంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆదర్శ జీవిత భాగస్వాములుగా నిలుస్తారని విశ్వసిస్తారు.

Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..!
Numerology Best Life Partner
Janardhan Veluru
|

Updated on: Jul 20, 2026 | 1:06 PM

Share

జీవితంలో డబ్బు, ఉద్యోగం, వ్యాపారం ఎంత ముఖ్యమైనవో.. మంచి జీవిత భాగస్వామి కూడా అంతే ముఖ్యం. అందుకే జీవిత భాగస్వామి రావడం కూడా అదృష్టాన్ని బట్టే ఉంటుందని చెబుతారు పెద్దలు.  కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు ఆదర్శ జీవిత భాగస్వాములుగా నిలుస్తారని చెబుతారు.

6, 15, 24 తేదీల్లో జన్మించినవారు

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారిపై శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి అందం, కళాత్మకత, అలంకరణపై మంచి అభిరుచి ఉంటుంది. కుటుంబాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడంతో పాటు భాగస్వామి వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. వీరితో జీవితం ఆనందంగా, హుందాగా సాగుతుందని అంటారు.

9, 18, 27 తేదీల్లో జన్మించినవారు

ఈ తేదీల్లో బయటకు కాస్త కఠినంగా కనిపించినా.. మనసులో ఎంతో ప్రేమ, బాధ్యత కలిగి ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అండగా నిలుస్తారు. భాగస్వామిని ఎవరైనా బాధపెడితే ముందుగా స్పందించే స్వభావం వీరిది. ఎల్లప్పుడూ రక్షణగా నిలిచే జీవిత భాగస్వామిగా గుర్తింపు పొందుతారు.

1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారు

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారికి సూర్యుడు అధిపతి. వీరు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కలిగి ఉంటారు. జీవిత భాగస్వామిని ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడతారు. మంచి సలహాదారులుగా, ప్రేరణనిచ్చే భాగస్వాములుగా ఉంటారని విశ్వసిస్తారు.

5, 14, 23 తేదీల్లో జన్మించినవారు

ఈ తేదీల్లో పుట్టినవారు చురుకుదనం, హాస్యచతురతకు ప్రసిద్ధులు. ఇంట్లో ఎలాంటి ఒత్తిడి పరిస్థితి వచ్చినా తమ మాటలతో, సరదా స్వభావంతో వాతావరణాన్ని మార్చేస్తారు. వీరితో జీవితం ఉల్లాసంగా సాగుతుందని న్యూమరాలజీ సూచిస్తుంది.

2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు

ఈ తేదీల్లో జన్మించినవారికి చంద్రుడు అధిపతి. వీరు ఎంతో సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. భాగస్వామి మనసులోని భావాలను సులభంగా అర్థం చేసుకుని అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధతో కుటుంబ బంధాలను బలపరుస్తారని న్యూమరాలజీ చెబుతోంది.

(గమనిక: న్యూమరాలజీ విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా రూపొందిన ఈ వివరాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు)

Follow Us