AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని వక్ర సంచారం.. ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారికి సవాళ్లు..!

Saturn Retrograde From July 27: కర్మఫలదాత శని గ్రహం 2026 జూలై 27 నుంచి వక్ర సంచారం ప్రారంభించనున్నాడు. ఈ ప్రభావంతో తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, మీన రాశుల వారు ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది. ఈ విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

శని వక్ర సంచారం.. ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారికి సవాళ్లు..!
Shani Vakri From July 27
Janardhan Veluru
|

Updated on: Jul 20, 2026 | 5:54 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫలదాతగా పేరుగాంచిన శని గ్రహం 2026 జూలై 27 నుంచి మీన రాశిలో వక్ర (తిరోగమన) సంచారం ప్రారంభించనున్నాడు. ఈ వక్ర గతి సుమారు 138 రోజుల పాటు.. అంటే డిసెంబర్ 11, 2026 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని వక్ర సంచారం ప్రతి రాశిపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వకుండా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశముంది. శని వక్ర సంచారం ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు ఈ కాలంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం, ఆర్థిక , ఆరోగ్యం విషయాల్లో ఏయే రాశుల వారు జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తులా రాశి

ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది.

వృశ్చిక రాశి

కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ, వైవాహిక జీవితంలో సహనం అవసరం. పనిలో ఒత్తిడి పెరిగినా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి

ఇంటి, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు లేదా కొత్త వ్యాపార నిర్ణయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీసుకోవడం మంచిది.

మకర రాశి

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. సోదరులు, బంధువులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మాట తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీన రాశి

శని ప్రస్తుతం మీన రాశిలోనే వక్ర సంచారం చేయనున్నందున ఈ రాశి వారికి ప్రభావం కొంత ఎక్కువగా ఉండొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్త అవసరం. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది.

జాగ్రత్తలు..

శని వక్ర సంచారంలో ఈ రాశుల వారు ఆర్థిక లాభాల కోసం షార్ట్‌కట్ మార్గాలను ఆశ్రయించకూడదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. రాతపూర్వక ఆధారాలు లేకుండా డబ్బు అప్పుగా ఇవ్వకండి. పెద్దలు, ఉద్యోగులు, కార్మికులను గౌరవంగా చూడండి. మొదలుపెట్టిన పనులను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. కోపంతో మాట్లాడకుండా సంయమనంతో వ్యవహరించండి.

Also Read: శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

(గమనిక: జ్యోతిష్య విశ్వాసాలు సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. ఈ వివరాలను నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన సమాచారంగా మాత్రమే పరిగణించాలి)

Follow Us
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు