AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిన్ కావాలని వచ్చింది.. కట్ చేస్తే.. బుల్లితెరపై రఫ్పాడిస్తోంది.. ఈ చిన్నారి ఎవరంటే..

సాధారణంగా నెట్టింట చాలా మంది చిన్ననాటి జ్ఞాపకాలు తెగ వైరలవుతున్నాయి. అటు హీరోహీరోయిన్స్ నిత్యం తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సెలబ్రెటీ ఫోటో తెగ వైరలవుతుంది. అటు సినిమాలు.. ఇటు స్మాల్ స్క్రీన్ పై పలు షోలతో సత్తా చాటుతుంది. ఇంతకీ ఈ ఆమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా.. ? అయితే ఎవరో తెలియాలంటే ఆర్టికల్ చదవాల్సిందే.

Tollywood : హీరోయిన్ కావాలని వచ్చింది.. కట్ చేస్తే.. బుల్లితెరపై రఫ్పాడిస్తోంది.. ఈ చిన్నారి ఎవరంటే..
Sreemukhi
Rajitha Chanti
|

Updated on: May 10, 2026 | 8:31 PM

Share

బుల్లితెరపై ‘ఎనర్జిటిక్ యాంకర్’గా, ‘రాములమ్మ’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రస్తుతం రెండు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకటి ఆమె చిన్ననాటి క్యూట్ ఫోటో వైరల్ అవ్వడం, రెండు ఆమె అత్యంత ఖరీదైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం. ఇటీవల శ్రీముఖికి సంబంధించిన ఒక చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో శ్రీముఖి చిన్నారిగా, సంప్రదాయబద్ధంగా, పల బుగ్గలతో ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. అప్పట్లో ఆమె ఎంతో అమాయకంగా ఉన్నప్పటికీ, ఆమె కళ్ళలో ఉన్న ఆ ఎనర్జీ ఇప్పుడు ఆమె చేసే యాంకరింగ్‌లోనూ కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె చిన్ననాటి ఫోటో చూసి “నాటి చిన్న సైజ్ లౌడ్ స్పీకర్.. నేటి భారీ లౌడ్ స్పీకర్” అంటూ నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తూనే ఆమెపై ప్రేమను కురిపిస్తున్నారు. కెరీర్ పరంగా వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. హైదరాబాద్‌లో విలాసవంతమైన కొత్త ఇంట్లోకి ఆమె తన తమ్మడితో కలిసి ఘనంగా అడుగుపెట్టారు. తన తమ్ముడు సుకృత్ కలిసి సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. పాలు పొంగించడం, ప్రత్యేక పూజలు చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

‘పటాస్’ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 3’లో రన్నరప్‌గా నిలిచి తన పాపులారిటీని అమాంతం పెంచుకున్నారు. ప్రస్తుతం కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా, వెండితెరపై కూడా కీలక పాత్రలు పోషిస్తూ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. కష్టపడి ఈ స్థాయికి చేరుకుని, సొంత ఇల్లు కొనుక్కున్న శ్రీముఖిని చూసి నెటిజన్లు “రాములమ్మ రియల్ ఇన్‌స్పిరేషన్” అని ప్రశంసిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఒక సాధారణ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి శ్రీముఖి చేరుకున్నారు. తన వాక్చాతుర్యం, ఎనర్జీతో బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు. కష్టపడితే ఫలితం దక్కుతుందని ఆమె ఈ కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా నిరూపించారు. మొత్తానికి శ్రీముఖి తన కొత్త ఇంట్లో సంతోషంగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us