AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?

జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనవిజయం సాధించిన తెలుగు తేజంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్ర దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్‌కు, సింధు ఇచ్చిన సరదా రిప్లై ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌?
Rajamouli And Sindhu
Nikhil
|

Updated on: Jul 22, 2026 | 6:10 AM

Share

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన సింధు, తనకు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర వస్తే నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి కనబరుస్తూ ఆమె చేసిన ఈ కామెంట్స్, త్వరలోనే సింధు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే చర్చకు దారి తీశాయి!

జపాన్ ఓపెన్‌లో..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్‌గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. గత కొంతకాలంగా ఫామ్ కోసం కష్టపడిన సింధు, ఈ టోర్నమెంట్‌తో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు, క్రీడాకారులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

సింధు ఆసక్తికర రిప్లై

సింధు విజయంపై స్పందించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా, “జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. మంచి కమ్‌బ్యాక్ ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది” అంటూ అభినందించారు. దీనికి స్పందించిన సింధు.. “ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే, మీ పరిచయ నటిగా మారడానికి నేను సంతోషిస్తాను” అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా?

సింధు ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలోనే సినిమాల్లోకి రానుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. అయితే, రాజమౌళికి క్రీడాకారుల నుంచి ఇలాంటి రిక్వెస్ట్‌లు రావడం కొత్తేమీ కాదు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా జక్కన్నతో సినిమా చేయాలని ఉందని పలుమార్లు సరదాగా పేర్కొన్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పీవీ సింధు బ్యాడ్మింటన్ కోర్టులోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒకవైపు క్రీడా రంగంలో దేశం గర్వించేలా అద్భుతమైన విజయాలు సాధిస్తూనే, మరోవైపు సినిమా రంగంపై తనకు ఉన్న ఆసక్తిని సరదాగా బయటపెట్టారు. రాజమౌళి మరియు సింధుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. భవిష్యత్తులో నిజంగానే సింధు సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తారేమో వేచి చూడాలి.

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?