AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 22 దినఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మలుపు..!

Horoscope Today (July 22, 2026): బుధవారం రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి, పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు కుటుంబ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి పూర్తి దినఫలాలను తెలుసుకోండి.

జూలై 22 దినఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మలుపు..!
Rashi Phalalu 22 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 22, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వ్యక్తిగత జీవితంలో చిన్నా చితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ఆర్థికంగా లాభం పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్య క్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు కానీ, కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అన్నివిధాలా సామరస్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశంఉంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యక్తిగత జీవితంలో చిన్నా చితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. కొందరు సహచరులు వల్ల ఇబ్బందులున్నాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులపై కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు, సహచరులతో సామరస్యం పెరుగుతుంది. సామాజికంగా బాగా అనుకూ లతలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కార్యకలాపాలు ముందుకు వెడతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో దూసు కుపోతారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధార ణంగా సాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యో గులకు ఆశించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరుగుతుంది. అయితే, ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యో గంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇతరత్రా కూడా రోజంతా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి బాగా పెరిగినా తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. తోబుట్టువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే కబురు అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారాల్లో ఆశించిన కార్య సిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా సాగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయా ణాలను వాయిదా వేయడం మంచిది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త పథకాలను అమలు చేసి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఏమాత్రం తీరిక లేని పరి స్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధి స్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద కాస్తంత శ్రద్ధ పెట్టాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పురోగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా, సకాలంలో నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలో చనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

Follow Us