నెలకు రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.1.56 లక్షల వరకు జీతం లభిస్తుంది..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంక్ బ్రాంచ్‌లు, కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 395 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 21, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి..
- మేనేజర్ (MMGS-II) పోస్టుల సంఖ్య: 163
- సీనియర్ మేనేజర్ (MMGS-III) పోస్టుల సంఖ్య: 153
- చీఫ్ మేనేజర్ (SMGS-IV) పోస్టుల సంఖ్య: 52
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (SMGS-V) పోస్టుల సంఖ్య: 20
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (TEGS-VI) పోస్టుల సంఖ్య: 7
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ, బీకాం, బీఈ / బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంటెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పోస్టుకు అనుగుణంగా బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టుల ఆధారంగా తప్పనిసరిగా వయస్సు 22 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 10, 2027వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
