- Telugu News Photo Gallery Cinema photos Gamma Awards Celebrations in Dubai with Pushpa 2 movie winning 5 awards
గామా అవార్డ్స్‌లో సత్తా సాటిన పుష్పరాజ్ టీం.. వైభవంగా దుబాయిలో వేడుకలు..
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అతిరథ మహారధుల సమక్షంలో మరింత గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు, సీఈఓ సౌరభ్ కేసరి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది.
Updated on: Sep 01, 2025 | 12:56 PM

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి.

నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న పుష్ప 2 ది రూల్ చిత్రం గామా అవార్డ్స్‌లో సత్తా సాటింది. గామా బెస్ట్ మూవీ, గామా బెస్ట్ యాక్టర్ 2024గా అల్లుఅర్జున్, గామా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో సుకుమార్, గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకున్నారు. ఇందులో పుష్పరాజ్ టీంకి 5 అవార్డులు లభించాయి.

కల్కి 2898ADకి గామా బెస్ట్ ప్రొడ్యూసర్‌గా అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ అవార్డులు అందుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమాకి గామా బెస్ట్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి, బెస్ట్ ఎడిటర్‌గా నవీన్ నూలి అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇందులో బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ లిరిసిస్ట్ (చుట్టమల్లే) కేటగిరీల్లో రత్న వేలు, రామ జోగయ్య శాస్త్రి దేవర సినిమాకి అవార్డులు అందుకున్నారు.

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్‌గా రోషన్, బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్గా శ్రీదేవి కోర్ట్ సినిమాకిగాను గామా అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. నల్లంచు తెల్లచీర పాటకు మిస్టర్ బచ్చన్ సినిమా బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ అవార్డులు భాను మాస్టర్, సమీరా భరద్వాజ్ అందుకున్నారు. అలాగే క్రిటిక్స్ బెస్ట్ మూవీగా రజాకార్ అవార్డు కైవసం చేసుకుంది. అలాగే తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం వంటి హీరోలకు కూడా అవార్డులు లభించాయి. మానస వారణాశి, నయన్ సారిక, నిహారిక కొణిదెల లాంటి వారికీ గామా అవార్డ్స్ వచ్చాయి. ఇంకా ఇందులో మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.

గ్లోబల్ కమెడియన్ గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం గారు స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్ గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశీ రౌటెల అవార్డును అందుకున్నారు. అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించిన ఈ కార్యక్రమంలో.. యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలెట్ గా నిలిచింది.




