Bigg Boss Telugu 10: బజర్దస్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలుసా? ఎట్టకేలకు సీక్రెట్ బయటపెట్టిన ఆటో రామ్ ప్రసాద్
జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తమ ఆట, మాట తీరుతో మంచి గానే గేమ్ ఆడుతున్నారీ ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్స్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. బ్లూ వర్సెస్ రెడ్ (సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్) గొడవలు, టాస్కులతో ఆడియెన్స్ కు మంచిగానే ఎంటర్ టైన్మెంట్ అందుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి కూడా అడుగు పెట్టారు. కాగా బిగ్ బాస్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షోలో టాప్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతోన్న వారిలో ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కూడా ఉన్నారు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్లుగా సత్తా చాటిన వారు ఇప్పుడు బిగ్ బాస్ 10లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తమదైన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పొట్టిగా కనిపించే నరేష్ వయసు ఎంత ఉంటుందోనని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నరేష్ ఎప్పుడూ కూడా తన ఏజ్ బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లో నరేష్ చేసినప్పటికీ ఎప్పుడూ కూడా తన ఏజ్ గురించి మాట్లాడలేదు నరేష్. చివరకు తన తోటి యాక్టర్స్ కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. అయితే ఎట్టకేలకు పొట్టి నరేష్ ఏజ్ సీక్రెట్ బయటపడింది.
బిగ్ బాస్ 10 రీసెంట్ ఎపిసోడ్ లో భాగంగా ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ వయసు బయట పెట్టాడు. ‘ నరేష్ అందరికీ చిన్నవాడిగా కనిపిస్తాడు. కానీ అతడు చిన్నోడేం కాదు.. వీడి వయసు అక్షరాలా 28 ఏళ్లు. పైగా ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు’ అని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పొట్టిగా ఉండే నరేష్ వయసు ఇంతా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కాగా 28 ఏళ్ల నరేష్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆటో రామ్ ప్రసాద్ హింట్ ఇచ్చాడు. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ జబర్దస్త్ కమెడియన్ పెళ్లిపీటలెక్కనున్నాడని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో నరేష్ ఆటతీరు కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియలో తన తోటి కంటెస్టెంట్స్ ను నరేష్ అడిగిన ప్రశ్నలు, పాయింట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నరేష్ ఆట తీరు చూస్తుంటే టాప్ 5లో ఉండడం గ్యారెంటీ అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




