జలమండలి అధికారులు నకిలీ మెసేజ్లపై ప్రజలను హెచ్చరించారు. వాటర్ బిల్లు పెండింగ్, మీటర్ రీడింగ్ అప్డేట్ పేరుతో యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు అడిగే సందేశాలకు స్పందించవద్దు. తెలియని యాప్లు డౌన్లోడ్ చేయవద్దు. అనుమానం వస్తే 155313కు కాల్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని కోరారు.