AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టాఫీస్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్.. ఈ నెల 30న కేంద్రం కీలక ప్రకటన..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్. ఈ నెల 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన రానుంది. కొత్త వడ్డీ రేట్లను సెప్టెంబర్ 30వ తేదీన కేంద్రం ప్రకటించేందుకు సిద్దమవుతోంది. దీంతో ఈ ప్రకటన కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.

పోస్టాఫీస్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్.. ఈ నెల 30న కేంద్రం కీలక ప్రకటన..
గడువుకు ముందే మూసివేసే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా, 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతాను గడువుకు ముందే మూసివేయవచ్చు. ఈ సందర్భంలో వర్తించే నిబంధనల ప్రకారం వడ్డీ రేటు తక్కువగా ఉండవచ్చు. తక్కువ మొత్తంలో నెలనెల పెట్టుబడి పెడుతూ మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడిని పొందవచ్చు. అయితే పోస్టాఫీసులో ఉండే పథకాలు ఎలాంటి రిస్క్‌ ఉండదు. ప్రభుత్వం నుంచి హామీ ఉంటుంది కాబట్టి మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ ఉండదు.
Venkatrao Lella
|

Updated on: Sep 26, 2026 | 8:46 PM

Share

దేశంలో కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సుకన్య సమృద్ది యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్రతో పాటు పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చూస్తూ ఉంటారు. అయితే వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికానికి కేంద్రం ప్రకటిస్తూ ఉంటుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను సెప్టెంబర్ 30న ప్రకటించనుంది. దీంతో కొత్త వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. వడ్డీ రేట్లను పెంచుతుందా..? లేదా తగ్గిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రం కొన్నేళ్లుగా వడ్డీ రేట్లను సవరించడం లేదు. యథావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఈ సారి కూడా అదే బాటలో నడుస్తుందా..? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త వడ్డీ రేట్ల గురించి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది .2026 జూన్ 30న జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇప్పుడు సెప్టెంబర్ 30న అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తించే వడ్డీ రేట్లను వెల్లడించనుంది. పోస్టాఫీస్ స్కీములతో పాటు పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన పథకాల్లో ఎక్కువమంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే వీటి వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ప్రభుత్వ బాండ్ల రాబడులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులను ఒక బెంచ్ మార్క్‌గా తీసుకుంటారు. ప్రభుత్వ బాండ్లలో పెరుగుదల నమోదువుతున్న క్రమంలో.. పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 30న రానున్న ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు.

స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లలో చిన్న మార్పు జరిగినా పెట్టుబడిదారులు ఎన్నో ఏళ్లుగా సంపాదిస్తున్న మొత్తం రాబడిపై ప్రభావం చూపుతుంది. కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి వడ్డీ రేట్లతో పాటు మెచ్యూరిటీ కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ బాండ్ల రాబడులు పెరిగినంత మాత్రాన పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచుతుందనేది చెప్పలేం. తుది రేట్లను అంతిమంగా కేంద్రమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి .దీంతో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఉద్యోగులు, వ్యాపారులు వీటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి, రిస్క్ లేని పెట్టుబడులు కోరుకునేవారు వీటిల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది.

Follow Us
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో