AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..

ప్రభాస్- గోపీచంద్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వీరి జోడీ కూడా ఒకటి. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా నటించడు. ఆ సినిమా షూటింగ్ లో మొదలైన ఈ ఇద్దరు హీరోల స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.

Prabhas: గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..
Prabhas, Gopichand
Basha Shek
|

Updated on: Sep 26, 2026 | 8:56 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టు తీస్తే ప్రభాస్-గోపీచంద్ ల జోడీ ముందుంటుంది. అప్పుడెప్పుడో వర్షం సినిమాలో మొదలైన వీరి ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. 2004లో రిలీజైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా అదరగొట్టాడు. ఈ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం మంచి స్నేహ బంధంగా మారింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. మరోవైపు ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే సందర్భమొచ్చినప్పుడల్లా తమ మధ్య అనుబంధాన్ని చాటుకుంటున్నారీ స్టార్ హీరోస్. ఆ మధ్యన ఇద్దరూ కలిసి ఒక టాక్ షోకు కూడా హాజరయ్యారు. ఇక వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కాగా ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ పలువురు స్టార్ హీరోయిన్లతో కలిసి నటించారు. నయనతార, అనుష్క, త్రిష, దీక్షాసేథ్ తదితర ముద్దుగుమ్మలు ఈ స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ప్రభాస్ కు అమ్మగానూ, గోపీచంద్ కు వదినగానూ నటించింది. మరి ఆమె ఎవరో తెలుసా?

కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా గుర్తుందా.? డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్ మొదటి భార్యగా కళ్యాణి నటించింది. అలా ఆమె ప్రభాస్ కు తల్లిపాత్ర చేశారు. ఇక గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాలో ఇదే కల్యాణి గోపీచంద్ కు వదినగా, జగపతి బాబు భార్యగా నటించి మెప్పించింది. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కల్యాణి. శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ ధుర్యోధన, వసంతం తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.  తన కెరీర్ లో  ఎక్కువగా హోమ్లీ పాత్రల్లోనే కనిపించిన ఈ ముద్డుగుమ్మ ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక కల్యాణి కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి
Prabhas, Gopichand, Kalyani

Prabhas, Gopichand, Kalyani

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us