AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

Vaibhav Sooryavanshi Records: మైదానంలో కేవలం షాట్లు కొట్టడమే కాకుండా, సమయానుకూలంగా ఇన్నింగ్స్ నిర్మించే నేర్పు తనకు ఉందని వైభవ్ రుజువు చేశాడు. అతి చిన్న వయసులోనే ఇన్ని మైలురాళ్లను అందుకుంటున్న ఈ యంగ్ సెన్సేషన్, భవిష్యత్తులో టీమిండియాకు సుదీర్ఘకాలం మ్యాచ్ విన్నర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..
Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Jul 26, 2026 | 7:32 PM

Share

Vaibhav Sooryavanshi Records: తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను భయపెట్టే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం హిట్టింగ్‌కే పరిమితం కాకుండా, కష్టమైన పిచ్‌పై పరిణతి చెందిన ఆటతో అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ వయసులోనే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు.

హరారే వేదికగా జరిగిన చివరి టీ20లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వేటలో తడబడిన చోట సూర్యవంశీ నిలకడగా నిలబడ్డాడు. అభిషేక్ శర్మ వంటి విధ్వంసక బ్యాటర్ విఫలమైన పిచ్‌పై, పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఆచితూచి ఆడాడు. దూకుడు మాత్రమే కాకుండా వికెట్ కాపాడుకుంటూ జట్టుకు కొండంత అండగా నిలవడం అతనిలోని పరిణతికి అద్దం పట్టింది.

కెరీర్‌లో స్లో హాఫ్ సెంచరీ.. కానీ భవిష్యత్తుకు శుభసూచకం!

సాధారణంగా మొదటి బంతి నుంచే బాదడమే అలవాటైన వైభవ్, ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేయడానికి 31 బంతులు తీసుకున్నాడు. ఇది అతని టీ20 కెరీర్‌లోనే అత్యంత నెమ్మదైన అర్ధశతకం కావడం విశేషం. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై కూడా ఈ కుర్రాడు 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన ఇన్నింగ్స్‌ను వేగవంతం చేస్తూ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

టీ20 చరిత్రలోనే సరికొత్త రికార్డు..

16 ఏళ్ల వయస్సు రాకముందే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటలకెక్కిన వైనం అందరినీ అబ్బురపరుస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే ధనాధన్ హాఫ్ సెంచరీ బాదిన అతను, ఇప్పుడు మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

హరారే మైదానంతో ప్రత్యేక అనుబంధం..

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వైభవ్‌కు బాగా కలసి వచ్చిందనే చెప్పాలి. గతంలో ఇక్కడే జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 80 బంతుల్లోనే 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మళ్లీ అదే వేదికపై సీనియర్ స్థాయిలోనూ వరుస ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతూ భారత క్రికెట్‌కు తానే భవిష్యత్ ఆశాకిరణమని నిరూపించుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us