AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. మెగాస్టార్ ఏమన్నారో చూశారా? వీడియో

మొదటి సినిమా ఉప్పెనతోనే జాతీయ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పుడు పెద్ద సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు? మరి ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తర్వాతి సినిమా ఏంటి? ఏ హీరోను లైన్ లో పెట్టాడన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Chiranjeevi: 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. మెగాస్టార్ ఏమన్నారో చూశారా? వీడియో
Buchibabu Sana, Chiranjeevi
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 8:55 AM

Share

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దాదాపు పదేళ్ల పాటు అసిస్టెంట్ గా పని చేశారు బుచ్చిబాబు సనా. ఆ తర్వాత ఉప్పెన సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టిలను పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు బుచ్చి బాబు. ఉప్పెన రిలీజైన ఐదేళ్ల తర్వాత మళ్లీ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ. 400 కోట్ల వైవు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమా యూనిట్ ను మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించి మరీ సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ఉప్పెన, పెద్ది సినిమా కథలను బుచ్చి బాబు చిరంజీవికి ముందే చెప్పారట. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా చూసిన చిరంజీవి బుచ్చిబాబును పిలిపి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సందర్భంగా డైరెక్టర్ కూడా చిరంజీవితో సరదాగా ముచ్చటించారు. ‘వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన ఇచ్చారు. రామ్ చరణ్ తో పెద్ది ఇచ్చారు. మీతో కూడా ఒక ఛాన్స్ ఇస్తే సినిమా చేస్తాను’ అని చిరంజీవిని ఛాన్స్ అడిగేశాడు బుచ్చి బాబు. దీనికి స్పందించిన చిరంజీవి.. ‘ నువ్వు అలా పరిగెత్తు, దూకమని, సాహసాలు చేయమంటే నేను చేయలేను. అందుకే నీతో సినిమా చేయడం కష్టం’ అని  సరదాగా అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవితో పెద్ది డైరెక్టర్..

కాగా మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వశిష్ట తెరకెక్కించిన విశ్వంభర ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే బాబీ తెరకెక్కిస్తోన్న మెగా 158 కూడా ఇటీవలే ప్రారంభమైంది. మొత్తానికి ఇప్పుడు చిరు లైనప్ బిజీగా నే ఉంది. మరోవైపు బుచ్చి బాబు మాత్రం తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us