తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్న దేశముదురు భామ
13 June 2026
Pic credit - Instagram
Rajeev
హన్సికా మోత్వాని.. తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఈ అమ్మడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది హన్సిక.
హన్సికా చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.
అవే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో.. వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించింది.
2007లో పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది.
రామ్‌తో 'మస్కా' చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్‌లో నటించింది.
ఆతర్వాత హన్సిక నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు సినిమాలతో మెప్పించింది.
కెరీర్ పీక్ లో ఉండగానే ఈ చిన్నది పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో హన్సిక పెళ్లి జరిగింది. ఇటీవలే ఈఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణించాలని చూస్తుంది హన్సిక.