AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌కు ఎదురు తిరిగిన PoK.. స్వాతంత్ర్యం కోసం రోడ్డెక్కిన వేలాది మంది జనం!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛ కోసం నినాదాలు చేశారు. నిరసనకారులు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, PoK ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌కు ఎదురు తిరిగిన PoK.. స్వాతంత్ర్యం కోసం రోడ్డెక్కిన వేలాది మంది జనం!
Pok Protest
Balaraju Goud
|

Updated on: Jun 13, 2026 | 2:51 PM

Share

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛ కోసం నినాదాలు చేశారు. నిరసనకారులు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, PoK ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ నేతలు, 1947లో గిరిజన దళాల సహాయంతో పాకిస్థాన్ ఈ ప్రాంతాన్ని బలవంతంగా ఆక్రమించిందని ఆరోపించారు. జమ్మూ, గిల్గిత్-బాల్టిస్తాన్, లడఖ్ ప్రాంతాల ప్రజలు కూడా తమ ఉద్యమానికి మద్దతు తెలపడం ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు మాట్లాడుతూ, “ఇది సింధ్, బలూచిస్తాన్, డి-చౌక్ కాదు. ఇది కాశ్మీర్. ఇక్కడ ఒక శవం పడితే లక్షలాది మంది వీధుల్లోకి వస్తారు” అని అన్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే ఉద్యమంలో అంతర్గత విభేదాలు కూడా బయటపడుతున్నాయి. సర్దార్ అమన్ ఖాన్, ఖ్వాజా మెహ్రాన్ వంటి నేతలు PoKకు పూర్తి స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని ప్రకటించారు. మరోవైపు ఉమర్ నజీర్, షౌకత్ నవాజ్ మీర్ వంటి నేతలు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

నిరసనకారుల ప్రధాన డిమాండ్లు రెండు. మొదటిది, PoK అసెంబ్లీలో ఉన్న 12 శరణార్థుల రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కోరుతున్నారు. రెండోది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేసే ప్రమాణ స్వీకారంలో పాకిస్థాన్‌కు విధేయత చూపే నిబంధనను తొలగించి, జమ్మూ-కాశ్మీర్ ఐక్యతకు విధేయత ప్రకటించేలా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ పరిణామాలు PoKలో రాజకీయ అసంతృప్తి పెరుగుతోందని సూచిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం, స్వయం ప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం వస్తున్న డిమాండ్లు భవిష్యత్‌లో మరింత పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us