AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 4:00 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం వద్ద బోనాల కుండల విక్రయ హక్కుల విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. ఆలయం రాచకొండ గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, సమీపంలోని అల్లాపురం గ్రామానికి చెందిన శాలివాహనులు కొన్నేళ్లుగా కుండలు విక్రయిస్తున్నారు. తాజాగా మరో వర్గం కూడా హక్కులు కోరడంతో వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గ్రామ పరిధిలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం రెండు గ్రామాల మధ్య హక్కుల రచ్చకు కేంద్రంగా మారింది. అమ్మవారి సన్నిధిలో భక్తులకు అవసరమైన బోనాల కుండలను అమ్ముకునే హక్కుల విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య తలెత్తిన వివాదం చివరకు మహిళల మధ్య తీవ్ర ఘర్షణకు, సిగపట్లకు దారితీసింది. ఈ ఆలయం రాచకొండ రెవెన్యూ పరిధిలో ఉన్నప్పటికీ, భౌగోళికంగా ఇది చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి సమీపంలో ఉంటుంది. రాచకొండ గ్రామంలో శాలివాహన కులస్తులు ఎవరూ లేకపోవడంతో, అల్లాపూర్ గ్రామానికి చెందిన శాలివాహనులు కొన్నేళ్లుగా ఇక్కడ బోనాల కుండలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఆలయం తమ మండల పరిధిలోనే ఉందనే కారణంతో సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన కొందరు శాలివాహనులు సైతం కుండలు అమ్ముకునే హక్కు తమకే ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలోనే ఇరు గ్రామాల మహిళలు ఒకరిపై ఒకరు తోపులాటలకు దిగుతూ సిగపట్లు పట్టుకోవడంతో అక్కడికి వచ్చిన భక్తులు అవాక్కయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చి ప్రశాంతంగా పూజలు చేసుకోవాల్సిన చోట, వ్యాపార హక్కులకై ఇలా నడిరోడ్డుపై కొట్లాటలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టైప్-1 షుగర్‌ బాధలకు చెక్‌! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!

నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!

Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్‌ నుంచి బార్‌ ఓనర్‌గా

Follow Us