AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దసరాకి ఇంటికెళ్లి తిరిగొస్తున్నారా..? తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్..

దసరా పండుగ సందర్భంగా ఇంటికెళ్లారా..? అయితే రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రకటించింది. ఇంటికెళ్లి తిరిగొచ్చేవారికి ఈ రైలు ఉపయోగపడనుంది. అక్టోబర్ 21న ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. టైమింగ్స్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Indian Railways: దసరాకి ఇంటికెళ్లి తిరిగొస్తున్నారా..? తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Oct 20, 2026 | 6:58 PM

Share

దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల కారణంగా ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో రైళ్లల్లో రద్దీ బాగా పెరిగింది. దీంతో ఈ రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వివిధ ప్రాంతాలకు వీటిని తిప్పుతోంది. ఇప్పటికే రైల్వేశాఖ వివిధ రూట్లలో అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టగా.. తాజాగా మరికొన్ని స్పెషల్ రైళ్లను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు ప్రయాణం సాగించనున్నాయి. దీంతో దసరా సందర్భంగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారికి ఈ రైలు ఎంతోగానే ఉపయోగపడనుది. దసరా సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల్లో నివసించేవారు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. వీరికి ఈ రైళ్లు ప్రయోజనం చేకూర్చనున్నాయి. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

-విశాఖపట్నం-సికింద్రాబాద్(08515) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీన అందుబాటులో ఉండనుంది. విశాఖపట్నంలో 15.50 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు.. తర్వాతి రోజు 07.05 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. వన్ వేగా ఈ ట్రైన్ నడపున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగనుందని స్పష్టం చేసింది. ఈ రైలులో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కింది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేవారు ఈ రైలు సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించింది.

-మైసూరు – వి.జి.ఎల్. ఝాన్సీ జంక్షన్(రైలు నం. 06275) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీన సర్వీసులు అందించనుంది. ఈ రైలు మైసూర్‌లో 17.05 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 10 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ రైలు కె.ఎస్.ఆర్. బెంగళూరు, ధర్మవరం, సికింద్రాబాద్, కాజీపేట, బలార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్ స్టేషన్లలో ఆగనుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలులో స్లీపర్. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని, వీటిని ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించింది.

దీపావళికి ప్రత్యేక రైళ్లు

అటు దీపావళికి రైల్వేశాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిల్లో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లను కూడా మొదలుపెట్టింది. దీంతో దీపావళికి ఇంటికి వెళ్లాలనుకునేవారు ఇప్పటినుంచే తమ టికెట్లను కన్ఫార్ చేసుకుంటున్నారు.

Follow Us