AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిస్పీ ఆలూ బోండా.. అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్ రుచి

క్రిస్పీ ఆలూ బోండాను ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ బోండాలను ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ రుచితో, చిట్కాలతో కూడిన ఈ ఆలూ బోండా రెసిపీతో మీ కుటుంబ సభ్యులను మెప్పించండి

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 10:59 PM

Share

ఒక గిన్నెలోకి ఒక కప్పు శెనగపిండిని తీసుకోండి. పైన పొర క్రిస్పీగా రావడానికి పావు కప్పు బియ్యప్పిండిని కలపండి. మీకు సాఫ్ట్ లేయర్ కావాలంటే బియ్యప్పిండిని వేయకుండా చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం కలపండి. మంచి రుచి, ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వామును చేతితో కొద్దిగా నలిపి వేయండి. ఈ పొడి పదార్థాలన్నింటినీ బాగా కలిపి, ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలపండి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. ఇది ఆలూ ఉండలపై బాగా పట్టుకునే కోటింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కలిపిన పిండిని స్టఫింగ్ సిద్ధం చేసే వరకు అంటే సుమారు 10-15 నిమిషాలు పక్కన పెట్టండి.

1 / 5
మూడు మీడియం సైజు బంగాళదుంపలను మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి రఫ్‌గా మ్యాష్ చేయండి. ముక్కలు పంటికి తగిలేలా రఫ్‌గా మ్యాష్ చేయడం స్ట్రీట్ స్టైల్ ప్రత్యేకత. ఒక రోల్ లేదా మిక్సర్ జార్‌లో మూడు పచ్చిమిరపకాయలు, అర అంగుళం అల్లం ముక్క, ఐదు లేదా ఆరు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అర టీ స్పూన్ ధనియాలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి.

2 / 5
ఇప్పుడు స్టఫింగ్ ఫ్రై చేయడానికి, స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఒక టీ స్పూన్ నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తరువాత దంచిన అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి. మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి రెండు నిమిషాలు మీడియం మంటపై వేయించండి.

3 / 5

ఉల్లిపాయలు దోరగా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి, మ్యాష్ చేసిన ఆలూ మిక్స్ కలపండి. ఇందులో అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఆలూలోని తడి ఆరే వరకు మీడియం నుండి హై ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించండి. ఆలూ మిక్స్ పల్చగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అటుకుల పొడిని కలపవచ్చు. చివరిగా ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, అర చెక్క నిమ్మరసం కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ స్టఫింగ్ చల్లారిన తర్వాత బోండా సైజుకు తగ్గట్లు చిన్న ఉండలు చేసుకోండి.

4 / 5
నానబెట్టిన శెనగపిండిని మళ్ళీ ఒకసారి కలిపి, చివరిగా పావు టీ స్పూన్ వంటసోడా, రెండు టీ స్పూన్ల వేడి నూనె వేసి కలపండి. వేడి నూనె వేయడం వలన బోండాలు క్రిస్పీగా వస్తాయి, వంటసోడా ఎక్కువగా అవసరం ఉండదు. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఆలూ ఉండలను ఒక్కొక్కటిగా పిండిలో బాగా ముంచి, అదనపు పిండిని వంపేసి, మీడియం వేడెక్కిన నూనెలోకి జాగ్రత్తగా వేయండి. చేతితో వేయడం కష్టంగా అనిపిస్తే స్పూన్‌ను ఉపయోగించండి, అలా అయితే బోండాలు రౌండ్‌గా, నీట్‌గా వస్తాయి. మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వెంటనే తిప్పకుండా, ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్‌గా వేయించండి. వేగిన బోండాలను నూనె నుండి తీసి ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా తయారు చేసిన క్రిస్పీ ఆలూ బోండాలను వేడివేడిగా గ్రీన్ చట్నీతో లేదా వెల్లుల్లి కారంతో సర్వ్ చేయండి. ఈ రుచికి ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు.

5 / 5
Follow Us