APPSC లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలు.. నవంబరు 2 వరకే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో 11 ఇంగ్లిష్, తెలుగు రిపోర్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబరు 13 నుంచి నవంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో నిర్దేశిత అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతం లభిస్తుంది..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో ఇంగ్లిష్ రిపోర్టర్, తెలుగు రిపోర్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఇంగ్లిష్ రిపోర్టర్స్ పోస్టులు10, తెలుగు రిపోర్టర్స్ పోస్టులు 1 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 నవంబరు 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఇంగ్లిష్ లేదా తెలుగు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగంతో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, ట్రాన్స్‌క్రిప్షన్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. ఇతర అలవెన్సులు, సర్వీస్ నిబంధనలు సంబంధిత అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్హతలు, షార్ట్‌హ్యాండ్ వేగం, టైప్‌రైటింగ్ అర్హతలు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి. దరఖాస్తు గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు తేదీలు, అర్హతలు, పోస్టుల వివరాలను APPSC అధికారిక నోటిఫికేషన్‌తో సరిపోల్చుకున్న తర్వాతే దరఖాస్తు చేయండి.
ఏపీపీఎస్సీ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




