AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: ఈరోజు శాపంగా కనిపించేది.. రేపు వరంగా మారవచ్చు! ఈ కథ చదివితే మీ ఆలోచన మారుతుంది

జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను మనం వెంటనే మంచిదని లేదా చెడ్డదని నిర్ణయించేస్తుంటాం. అనుకున్నది జరిగితే సంతోషిస్తాం.. అనుకున్నది జరగకపోతే నిరాశ చెందుతాం. కానీ ఈరోజు మనకు నష్టంగా కనిపించిన సంఘటనే రేపు మన జీవితంలో గొప్ప మేలుకు కారణం కావచ్చు. అలాగే ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్న విషయం భవిష్యత్తులో ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు. అందుకే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను చూసి తొందరపడి తీర్పులు ఇవ్వకూడదని చెప్పే ఒక ఆసక్తికరమైన కథ ఇది..

Life Lesson: ఈరోజు శాపంగా కనిపించేది.. రేపు వరంగా మారవచ్చు! ఈ కథ చదివితే మీ ఆలోచన మారుతుంది
What Seems Like Bad Luck Today May Become Good Luck Tomorrow
Srilakshmi C
|

Updated on: Oct 16, 2026 | 11:04 AM

Share

ఒకప్పుడు చైనాలో లావో ట్జు కాలంలో ఒక గ్రామంలో ఓ వృద్ధ రైతు నివసించేవాడు. అతను చాలా పేదవాడు. అయితే అతని దగ్గర ఎంతో అందమైన తెల్ల గుర్రం ఉండేది. ఆ గుర్రం అందాన్ని చూసి రాజులు సైతం ఆశ్చర్యపోయేవారు. దాన్ని సొంతం చేసుకోవాలని రాజు కూడా ప్రయత్నించాడు. అందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పాడు. కానీ వృద్ధ రైతు మాత్రం గుర్రాన్ని అమ్మడానికి అంగీకరించలేదు. ‘ఈ గుర్రం నాకు కేవలం ఒక జంతువు కాదు. నా కుటుంబ సభ్యుడితో సమానం. కుటుంబ సభ్యుడిని డబ్బు కోసం ఎలా అమ్మగలను?’ అని చెప్పేవాడు. గ్రామస్థులు సైతం గుర్రాన్ని అమ్మేస్తే అతను ధనవంతుడవుతాడని సలహా ఇచ్చారు. అయినప్పటికీ రైతు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గుర్రం కనిపించకుండా పోయింది.. అంతా దురదృష్టమన్నారు!

ఒకరోజు ఉదయం రైతు తన గుర్రం కోసం గజశాలకు వెళ్లాడు. కానీ అక్కడ గుర్రం కనిపించలేదు. అది ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులంతా అతని దగ్గరకు వచ్చారు. ‘మేము ముందే చెప్పాం కదా! గుర్రాన్ని అమ్మేస్తే నీకు చాలా డబ్బు వచ్చేది. ఇప్పుడు గుర్రం కూడా పోయింది. ఇది నీ దురదృష్టం కాకపోతే మరేమిటి?’ అని అన్నారు. అప్పుడు రైతు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. ‘గుర్రం గజశాలలో లేదన్నది నిజం. కానీ అది దురదృష్టమని ఎలా చెప్పగలం? జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చూడాలి. అది మంచిదో చెడ్డదో ఇప్పుడే ఎలా నిర్ణయించగలం?’ రైతు మాటలు గ్రామస్థులకు వింతగా అనిపించాయి. అతనికి పిచ్చి పట్టిందని భావించారు. కొన్ని రోజులు గడిచాయి. సుమారు పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి అనూహ్యమైన సంఘటన జరిగింది. రైతు గుర్రం తిరిగి వచ్చింది. అది ఒక్కటే రాలేదు.. తనతో పాటు పన్నెండు అడవి గుర్రాలను కూడా తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎంతో ఆశ్చర్యపోయారు.

‘నువ్వు నిజంగా అదృష్టవంతుడివి! ఒక గుర్రం పోయిందని బాధపడ్డావు. ఇప్పుడు ఏకంగా పన్నెండు గుర్రాలు అదనంగా వచ్చాయి. ఇక నువ్వు ధనవంతుడవుతావు!’ అని అన్నారు. అయితే రైతు మాత్రం మళ్లీ అదే మాట చెప్పాడు. ‘గుర్రం తిరిగొచ్చింది. దానితో పాటు పన్నెండు గుర్రాలు వచ్చాయి. ఇది జరిగిన విషయం. కానీ దీని వల్ల భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే ఇప్పుడే అదృష్టమని నిర్ణయించలేం’. ఈసారి గ్రామస్థులు అతని మాటలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. వృద్ధ రైతుకు ఒకే ఒక్క కుమారుడు ఉండేవాడు. ఆ యువకుడు కొత్తగా వచ్చిన అడవి గుర్రాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఒకరోజు గుర్రానికి శిక్షణ ఇస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని కాళ్లు విరిగిపోయాయి. గ్రామస్థులు మళ్లీ రైతు దగ్గరకు వచ్చారు. ‘నీకు వచ్చిన పన్నెండు గుర్రాల వల్లే ఈ ప్రమాదం జరిగింది. నీకు వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు ఇప్పుడు నడవలేని పరిస్థితికి వచ్చాడు. ఇది ఎంతటి దురదృష్టం!’ అని అన్నారు. రైతు మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. ‘నా కొడుకు కాళ్లు విరిగాయన్నది నిజం. కానీ ఇది దురదృష్టమని ఇప్పుడే ఎలా చెప్పగలం? భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా!’ గ్రామస్థులు అతని మాటలను పట్టించుకోలేదు. తమ అభిప్రాయమే సరైనదని భావించారు.

ఇవి కూడా చదవండి

కొన్ని వారాల తర్వాత ఆ దేశం పొరుగు రాజ్యంతో యుద్ధానికి దిగింది. సైన్యాన్ని పెంచుకోవడానికి గ్రామంలోని యువకులందరినీ బలవంతంగా సైన్యంలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి యువకులు యుద్ధానికి బయలుదేరారు. అయితే రైతు కొడుకుకు కాళ్లు విరిగిపోవడంతో అతడిని సైన్యంలోకి తీసుకెళ్లలేదు. యుద్ధం తీవ్రంగా సాగింది. శత్రు రాజ్యం బలంగా ఉండటంతో తమ దేశం ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. సైన్యంలోకి వెళ్లిన యువకులు తిరిగి వస్తారో లేదోనని గ్రామస్థులు ఆందోళన చెందారు. అప్పుడు వారందరికీ వృద్ధ రైతు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వారంతా అతని దగ్గరకు వచ్చి ‘నువ్వు చెప్పింది నిజమే. నీ కొడుకు కాళ్లు విరగడం దురదృష్టంగా కనిపించింది. కానీ అదే అతడిని యుద్ధానికి వెళ్లకుండా కాపాడింది. మా పిల్లలు మాత్రం ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియడం లేదు’ అని బాధపడ్డారు. రైతు మళ్లీ ప్రశాంతంగా ఇలా అన్నాడు ‘మీ పిల్లలను సైన్యంలోకి తీసుకెళ్లారు. నా కొడుకును తీసుకెళ్లలేదు. ఇదే ఇప్పుడు మనకు తెలిసిన నిజం. కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి సంఘటనకు వెంటనే మంచి లేదా చెడు అనే ముద్ర వేయడం ఎందుకు?’ ఈ మాటల్లోనే జీవితానికి సంబంధించిన గొప్ప సత్యం దాగి ఉంది.

ఈ కథ మనకు నేర్పే జీవిత పాఠాలు

ప్రతి సంఘటనకు వెంటనే తీర్పు ఇవ్వకండి.. మనకు జరిగిన ఒక సంఘటన వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయో ముందుగానే చెప్పలేం. అందుకే ఏదైనా జరిగిన వెంటనే అది మంచిదని లేదా చెడ్డదని నిర్ణయించకుండా కొంత సమయం ఇవ్వాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండండి.. కష్టాలు వచ్చినప్పుడు భయపడటం, బాధపడటం సహజం. కానీ ఆ భావోద్వేగాల్లోనే చిక్కుకుపోకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశాంతంగా ఆలోచించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. మన నియంత్రణలో లేని విషయాలను అంగీకరించండి.. జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం నియంత్రించలేం. కొన్ని సంఘటనలు మన ప్రణాళికలకు అనుగుణంగా జరగవు. అలాంటప్పుడు వాస్తవాన్ని అంగీకరించి, మనం చేయగలిగిన పనిపై దృష్టి పెట్టడం మంచిది. సంతోషంలోనూ, బాధలోనూ సమతుల్యతను పాటించండి.. అనుకున్నది జరిగినప్పుడు అతిగా ఉత్సాహపడటం, అనుకున్నది జరగనప్పుడు పూర్తిగా కుంగిపోవడం మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మారుతుంటాయని గుర్తించి, భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి.

ఇతరుల జీవితాలపై తొందరపడి తీర్పులు ఇవ్వకండి.. బయటకు కనిపించే పరిస్థితుల ఆధారంగా ఒకరి జీవితం ఎలా ఉందో నిర్ణయించడం సరికాదు. వారి పరిస్థితుల వెనుక మనకు తెలియని కారణాలు ఉండవచ్చు. కాబట్టి ఇతరుల జీవితాల గురించి తీర్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈరోజు ఓటమి.. రేపటి విజయానికి పునాది కావచ్చు! వృద్ధ రైతు కథ మనకు గుర్తుచేసే ముఖ్యమైన విషయం ఒక్కటే.. జీవితంలో ప్రతి సంఘటనకు వెంటనే మంచి లేదా చెడు అనే ముద్ర వేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం కోరుకున్నది దక్కకపోవడం భవిష్యత్తులో మరో అవకాశానికి దారి తీయవచ్చు. అలాగే మనకు గొప్ప విజయంగా కనిపించే విషయం కూడా కొత్త సవాళ్లను తీసుకురావచ్చు. అయితే ప్రతి కష్టం తప్పనిసరిగా మంచికే దారి తీస్తుందని కాదు. నష్టాన్ని నష్టంగానే గుర్తించాలి, బాధను అనుభవించడానికి మనకు మనం అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితి ఆధారంగా మొత్తం భవిష్యత్తును నిర్ణయించకూడదు. కాబట్టి జీవితంలో ఏది జరిగినా తొందరపడి తీర్పు ఇవ్వకండి. పరిస్థితులను అర్థం చేసుకోండి, మీకు సాధ్యమైన చర్యలు తీసుకోండి, మిగిలిన వాటిని ప్రశాంతంగా ఎదుర్కోండి. ఈరోజు శాపంగా కనిపించేది రేపు వరంగా మారవచ్చు.

Follow Us
నైవేద్యంగా మాంసాహారం.. దేశంలోని ఈ ప్రముఖ ఆలయాల ప్రత్యేకత తెలిస్తే
నైవేద్యంగా మాంసాహారం.. దేశంలోని ఈ ప్రముఖ ఆలయాల ప్రత్యేకత తెలిస్తే
టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు స్మృతి రెడీ
టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు స్మృతి రెడీ
ఈరోజు శాపంగా కనిపించేది.. రేపు వరంగా మారవచ్చు! మీ ఆలోచన మార్చే కథ
ఈరోజు శాపంగా కనిపించేది.. రేపు వరంగా మారవచ్చు! మీ ఆలోచన మార్చే కథ
తన సీరియల్ పేరుతో..కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత
తన సీరియల్ పేరుతో..కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటే నెల ఖర్చెంత..?
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటే నెల ఖర్చెంత..?
APPSC నుంచి 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలు
APPSC నుంచి 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలు
హన్సిక మోత్వానీ ఫిట్‌నెస్ సీక్రెట్స్..
హన్సిక మోత్వానీ ఫిట్‌నెస్ సీక్రెట్స్..
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. చాహల్ సంచలన వ్యాఖ్యలు
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. చాహల్ సంచలన వ్యాఖ్యలు
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!