AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో DSC 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ-2026 ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవో నంబర్లు 28, 29, 30 ద్వారా సాధారణ పాఠశాలల్లో 2,111 పోస్టులు, ప్రత్యేక విద్యా విభాగంలో 350 పోస్టులు, సొసైటీలు, మోడల్ స్కూళ్ల పరిధిలో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు..

ఏపీలో DSC 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
AP DSC Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 15, 2026 | 7:55 AM

Share

అమరావతి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ-2026 ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా, ప్రభుత్వం మూడు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మరో మూడు వారాల తర్వాత పోస్టుల పూర్తి వివరాలు, అర్హతలు, పరీక్షల షెడ్యూల్‌తో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. డీఎస్సీ 2026లో భాగంగా సాధారణ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగాలు, సొసైటీలు, ఆదర్శ పాఠశాలల్లోని బోధనా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో నంబర్లు 28, 29, 30లను విడుదల చేసింది.

  • జీవో నంబర్ 28: సాధారణ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్లో 2,111 పోస్టులు.
  • జీవో నంబర్ 29: ప్రత్యేక విద్యా విభాగంలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలకు సంబంధించి 350 పోస్టులు.
  • జీవో నంబర్ 30: సొసైటీలు, మోడల్ స్కూళ్ల పరిధిలో ప్రిన్సిపల్స్, పీజీటీ, పీడీ, పీఈటీ తదితర విభాగాల్లో 260 పోస్టులు.

ఈ మూడు విభాగాల్లో కలిపి మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నారు.

నవంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ?

డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణను నవంబర్ 3 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు సుమారు నెల రోజుల వరకు గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తుల ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి అధికారిక వివరాలు సమగ్ర నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ 3లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముందుగా షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత మూడు వారాల్లోగా పూర్తి వివరాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌కు ముందు నోటిఫికేషన్‌కు సంబంధించిన అవసరమైన చర్యలను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోని బోధనా పోస్టుల భర్తీకి సంబంధించి స్థానిక కేడర్ విభజన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఆయా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. డీఎస్సీ-2026కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులకు పలు అంశాలపై స్పష్టత రానుంది. ముఖ్యంగా పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, పరీక్షల తేదీలు, హాల్‌టికెట్ల జారీకి సంబంధించిన సమాచారం వెల్లడికానుంది.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూడటంతో పాటు, తమ విద్యార్హతలకు అనుగుణంగా పోస్టుల వివరాలను పరిశీలించుకోవాలి. దరఖాస్తుల తేదీలు, అర్హతలు, పరీక్షల షెడ్యూల్‌పై తుది నిర్ణయానికి అధికారిక ప్రకటననే ప్రామాణికంగా తీసుకోవాలి.

Follow Us
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..