AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన కొత్త హై-పర్ఫార్మెన్స్ సెడాన్ 'Mercedes-Benz AMG E 53'ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో వస్తున్న ఈ లగ్జరీ సెడాన్ గురించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం!

3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌
Mercedes Benz Amg E 53
Nikhil
|

Updated on: Jul 27, 2026 | 8:10 PM

Share

రూ. 1.45 కోట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వస్తున్న మెర్సిడెస్-బెంజ్ హై-పర్ఫార్మెన్స్ సెడాన్ ‘Mercedes-Benz AMG E 53’ కారు 585 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకునే అద్భుతమైన పనితీరు కలిగిన ఈ ప్రీమియం స్పోర్ట్స్ సెడాన్ పూర్తి విశేషాలను తెలుసుకుందాం!

ఆకర్షణీయమైన డిజైన్

ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో సరికొత్త ‘AMG E 53’ సెడాన్‌ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. సాధారణ E-Class మోడల్‌తో పోలిస్తే ఈ AMG E 53 మరింత ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రత్యేకమైన LED హెడ్‌ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), AMG స్టైల్ ఫ్రంట్ గ్రిల్, బూట్ లిడ్ స్పాయిలర్, ఆకర్షణీయమైన 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

టెక్నాలజీ ఫీచర్లు

ఈ కారు ఇంటీరియర్ అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దబడింది. ఇందులో డ్రైవర్ సౌలభ్యం కోసం 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

  • ప్రీమియం సౌండ్ కోసం Burmester ఆడియో సిస్టమ్ ఇచ్చారు.
  • విశాలమైన అనుభూతి కోసం పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
  • వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా సదుపాయాలు ఉన్నాయి.

శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్

ఈ కారులో అత్యంత శక్తివంతమైన 3.0-లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ ఏకంగా 585 హార్స్‌పవర్ పవర్‌ను, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను, మెరుగైన రోడ్డు గ్రిప్ కోసం 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను జత చేశారు. ఇక AMG పెర్ఫార్మెన్స్ ప్లస్ ప్యాకేజీతో ఈ కారు గరిష్టంగా 612 హార్స్‌పవర్ వరకు శక్తిని అందిస్తుంది.

ఫలితంగా, కారు కేవలం 3.8 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు అలాగే గరిష్టంగా 280 kmph టాప్ స్పీడ్‌ను తాకగలదు. అధిక పనితీరు, సరికొత్త లగ్జరీ, ఆధునిక సాంకేతికతను కోరుకునే కార్ల ప్రియులకు మెర్సిడెస్-బెంజ్ AMG E 53 భారత మార్కెట్లో ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది.

Follow Us
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..