Bigg Boss Telugu 10: ఈ వారం నామినేషన్స్‌లో టాప్ కంటెస్టెంట్స్.. ఇక ఆ ఇద్దరు బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా?
గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కంటెస్టెంట్లకు ఈ వారం బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏకంగా టాప్ కంటెస్టెంట్స్ అందరినీ నామినేషన్స్ లోకి తీసుకొచ్చాడు. దీంతో ఈ వారం డబుల్ లేదా త్రిబుల్ ఎలిమినేషన్ కూడా జరగవచ్చని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ విజయవంతంగా 10వ వారంలోకి ప్రవేశించింది. గత వారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీపావళీ పండుగ సందర్భంగా ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని చెబుతూనే ఇక నుంచి కంటెస్టెంట్స్ కు ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించాడు. అనుకున్నట్లే పదో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్లకు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారిని గుర్తించి నామినేట్ చేయాలని సూచించారు. దీంతో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ నామినేషన్స్ వేశారు. అయితే కంటెస్టెంట్ల నామినేషన్స్ ను అసలు పరిగణనలోకి తీసుకోలేదు బిగ్ బాస్. అంతేకాదు ఈ వారం ఇంటి సభ్యులందరిని నామినేట్ చేస్తున్నాను అని షాక్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ టెంపర్ వంశీ మినహా అందరూ ఈ వారం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కోనున్నారు. అంటే పదో వారంలో ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ మాస్టర్, దేబ్జానీ, రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, శ్వేతా, శివకుమార్, త్రిగుణ్, రామకృష్ణ నామినేషన్స్ లో నిలిచారు. దీంతో ఈ వారం కూడా టాప్ కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గానీ, ట్రిపుల్ ఎలిమినేషన్ గానీ ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్నది.
కాగా పదో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఇప్పటికే ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ముఖేష్- త్రిగుణ్ లు టాప్ ప్లేస్ కోసం నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నారు. ఆశ్చర్యకరంగా కొన్ని అన్ అఫీషియల్ పోల్స్‌లో త్రిగుణ్‌ని వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకుని వచ్చేశాడు ముఖేష్. దీనికి ప్రధాన కారణం రోహిత్ ఎలిమినేషన్ కావడంతో అతని ఫ్యాన్స్ అందరూ ముఖేష్ కు ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇక మూడో స్థానంలో దేబ్జానీ, నాలుగో ప్లేస్ లో అమన్, ఐదో ప్లేస్ లో జబర్దస్త్ నరేష్, ఆరో స్థానంలో రామ్ ప్రసాద్ ఉన్నారు. వీరి తర్వాత సుధీర్, శ్వేత, శివ్ కుమార్, వర్షిణీ, నీతూ మాస్టర్ ఉన్నారు. కాగా గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు నీతూ మాస్టర్, శివ్ కుమార్, సుధీర్. ప్రస్తుతం వీరంతా నామినేషన్స్ లో ఉన్నారు. ముఖ్యంగా నీతూ మాస్టర్ అలాగే సుధీర్ ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఎలిమినేషన్స్ లో ఏమైనా జరగవచ్చు
బిగ్ బాస్ 10 లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
