Optical Illusion: చెప్పుకోండి చూద్దాం.. ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో కనిపెడితే మీరే తోపు
సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలకు సవాల్ విసురుతుంటాయి. అందుకే వీటిని పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు.

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కళ్లతో పాటు మెదడుకు కూడా పని చెబుతాయి. అంతేకాకుండా మన ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి ఎప్పటికప్పుడు జనాలకు కొత్త సవాళ్లు విసురుతుంటాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా వాటిలోని చిక్కులను విప్పేందుకు మెదడుకు ఎక్కువగా పని చెబుతుంటారు. ఈ ప్రక్రియలో వారి ఆలోచనా శక్తి పెరగడంతో పాటు సమస్యలను పరిష్కరించే విధానంలోనూ కొత్త మెలకువలు నేర్చుకుంటారు.
ఇది నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను పరిష్కరించడం ద్వారా మీ తెలివితేటలను మెరుగుపరచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. తొలి ప్రయత్నంలో మీరు విజయం సాధించలేకపోయినా పర్వాలేదు. క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే వాటిని సులభంగా పరిష్కరించవచ్చు.
వైరల్ చిత్రంలో ఏముంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో వరుసగా నాలుగు వాటర్ గ్లాసులు ఉన్నాయి. అయితే వాటిలో ఒక గ్లాసులో కత్తెర, మరో గ్లాసులో పిన్నులు, ఇంకో గ్లాసులో ఎరేజర్, చివరి గ్లాసులో గడియారం ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఏ గ్లాసులో ఎక్కువ నీరు ఉందో 10 సెకన్లలో కనిపెట్టాలి. కాస్త లాజిక్‌గా ఆలోచిస్తే మీరు సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే.. మీ సమయం ఇప్పుడే ప్రారంభమవుతుంది.
సమాధానం ఇదిగో..
మీకు ఇచ్చిన సమయంలో ఏ గ్లాసులో ఎక్కువ నీరు ఉందో కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్! మీరు తెలివైనవారని అర్థం. ఒకవేళ మీరు సమాధానాన్ని కనిపెట్టలేకపోయినా పర్వాలేదు. సమాధానం మేమే చెబుతాం. అక్కడున్న నాలుగు గ్లాసుల్లో గ్లాస్-Bలోనే ఎక్కువ నీరు ఉంది. ఎందుకంటే మిగతా గ్లాసుల్లో ఉన్న వస్తువులతో పోలిస్తే B గ్లాసులోని వస్తువు పరిమాణం చిన్నగా ఉంది. కాబట్టి ఆ గ్లాసులోనే ఎక్కువ నీరు ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
