AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. 19 ఏళ్లకే స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ సినీరంగంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకే అంటే 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత కథానాయికగా ఏంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా ఇప్పుడు వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 6:38 PM

Share
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ నజ్రియా నజిమ్. తన సహజ నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పట్లో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా తమిళ చిత్రసీమలోకి ఆమె సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై నజ్రియా తాజాగా స్పందించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

1 / 5
కోలీవుడ్‌లో నజ్రియా చివరిసారిగా నటించిన డైరెక్ట్ తమిళ సినిమా విడుదలై సుమారు పన్నండేళ్లు కావస్తోంది. అయితే సినిమాల్లో విరామంపై ఆమె మాట్లాడుతూ.. తాను కావాలని కావాలని సినిమాలకు దూరంగా ఉండలేదని, కేవలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని తెలిపారు. నటనపై తనకు ఇప్పటికీ అమితమైన ప్రేమ ఉందని, అయితే తన మనసుకు నచ్చిన కథలు, బలమైన పాత్రలు కుదరకపోవడం కూడా మరో కారణమని ఆమె వెల్లడించారు.

2 / 5
పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులు, కుటుంబంతో గడపాల్సిన సమయం కారణంగా సినిమాల ఎంపికలో కాస్త సెలెక్టివ్‌గా మారినట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత నేరుగా సూర్య లాంటి స్టార్ హీరో చిత్రంతో తమిళంలో రీఎంట్రీ ఇవ్వడంపై నజ్రియా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సూర్య కాంబినేషన్‌లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో ఆమె నటించిన 'రాజా రాణి'  వంటి చిత్రాలు తమిళ ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

3 / 5
 ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా, 'నేరం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రాజా రాణి', 'నాయండి', 'బెంగళూరు డేస్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ ఇండియావ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

4 / 5
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొద్దికాలం గ్యాప్ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత 'ట్రాన్స్', తెలుగులో 'అంటే సుందరానికీ!' వంటి చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. సీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 81.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

5 / 5
Follow Us
న్యూజిలాండ్ టూర్‌కు పంత్ రెడీ.. అయితే షరతులు వర్తిస్తాయి..!

12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

దసరాకు కాదు.. దీపావళికే బతుకమ్మ పండుగ.. ఆడ, మగ కలిసి ఆడటం వెనుక

పెళ్లిపీటలెక్కనున్న 'ఇరుముడి' హీరోయిన్.. వరుడు ఎవరంటే?

అరెరే విరిగిన కుర్చీలు కొత్తగా మార్చడం ఇంత ఈజీనా..

ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండొచ్చా..? కేంద్రం రూల్స్

ఒవెన్ లేకుండా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా చేయండి ఇలా

ఎండతో పనిలేదు..నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి నిల్వ పచ్చడి

ఆర్యవీర్ అద్భుతమైన సెంచరీ.. యుఏఈపై భారత్ ఘన విజయం

మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్