ఇదెక్కడి సినిమా రా నాయనా.. దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం థ్రిల్లర్..
ఎలాంటి మాస్ ఎలివేషన్లు లేకుండా పక్కా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్‌తో సాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రం 1990ల నేపథ్యంలో రెండు క్లిష్టమైన మిస్టరీ కేసులను పోలీసులు ఛేదించిన తీరును ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులకు పర్ఫెక్ట్ ఛాయిస్.

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం పక్కా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ‘దృశ్యం’, ‘కన్నూర్ స్క్వాడ్’, ‘నాయట్టు’ వంటి సినిమాలను ఇష్టపడే సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియుల కోసం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అద్భుతమైన చిత్రం ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’. మలయాళీ యాక్టర్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి తప్పకుండా చూడదగిన సినిమా. ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’ అంటే తెలుగులో ‘వెతికితే దొరుకుతుంది’ అని అర్థం. 1990ల కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టోవినో థామస్ ‘సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆనంద్ నారాయణన్’ అనే నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాలో ఆనంద్ నారాయణన్ హ్యాండిల్ చేసే రెండు వేర్వేరు హత్య మరియు మిస్సింగ్ కేసుల విచారణను అత్యంత సహజంగా చూపించారు.
మొదటి కేసు (లవ్లీ మాథన్ గల్లంతు): లవ్లీ మాథన్ అనే క్రిస్టియన్ అమ్మాయి అకస్మాత్తుగా మాయమవుతుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఆనంద్ స్వీకరిస్తాడు. అయితే విచారణ లోతులకు వెళ్లేకొద్దీ రాజకీయ, సామాజిక, మతపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈ క్రమంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఆనంద్, అతడి పోలీసు బృందం సస్పెన్షన్‌కు గురవుతారు.
రెండో కేసు (శ్రీదేవి హత్య కేసు): సస్పెన్షన్ నుంచి బయటపడేందుకు ఆనంద్‌కు మరో అవకాశం లభిస్తుంది. చాలాకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న ‘శ్రీదేవి’ మర్డర్ కేసును ఆయనకు అప్పగిస్తారు. ఆ ఊరి ప్రజలకు పోలీసులపై నమ్మకం లేని పరిస్థితుల్లో, సరైన ఆధారాలు లేకుండా ఆనంద్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడనేదే కథ అసలు మలుపు.
ఈ సినిమాకు ప్రధాన బలం టోవినో థామస్ పరిణతి చెందిన అద్భుత నటన. రొటీన్ కమర్షియల్ హీరోలా మాస్ డైలాగ్‌లు చెప్పకుండా, చట్టం మరియు వ్యవస్థ పరిమితులకు లోబడి కేవలం ఆధారాలు సేకరించే సాధారణ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన చాలా సహజంగా నటించారు. పోలీసులు విచారణలో ఎదుర్కొనే ఆచరణాత్మక ఇబ్బందులు, తప్పుదోవ పట్టించే ఆధారాలను దర్శకుడు డార్విన్ కురియాకోస్ అత్యంత వాస్తవికంగా తెరకెక్కించారు. 1990ల నాటి వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాటి పోలీస్ స్టేషన్లు, ల్యాండ్‌లైన్ ఫోన్లు, పాత మోడల్ వాహనాలు ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాలోని సస్పెన్స్‌ను చివరి వరకు కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
