AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రూ. 1.5 కోట్ల బడ్జెట్.. 14 రెట్లు లాభాలు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరేట్..

టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీసాధించిన అసాధారణ విజయంపై ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో ఓటీటీ, భారీ శాటిలైట్ హక్కులు లేకపోయినా కేవలం రూ. 1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో ఏకంగా 14 రెట్ల లాభాలతో రూ. 14 నుంచి 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

Tollywood : రూ. 1.5 కోట్ల బడ్జెట్.. 14 రెట్లు లాభాలు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరేట్..
Manasantha Nuvve Movie
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 8:11 PM

Share

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రాలలో ‘మనసంతా నువ్వే ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమా సేన్ హీరోయిన్‌గా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, అప్పట్లో ఈ చిత్రం సాధించిన బాక్సాఫీస్ వసూళ్ల గురించి నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, భారీ శాటిలైట్ హక్కుల మార్కెట్ లేని రోజుల్లోనే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అసాధారణం. ఈ సినిమా నిర్మాణానికి కేవలం సుమారు కోటిన్నర రూపాయల బడ్జెట్ మాత్రమే అయిందని ఆయన తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎలాంటి ఆధునిక డిజిటల్ హక్కుల సపోర్ట్ లేకుండానే కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే ఈ సినిమా ఏకంగా పెట్టిన బడ్జెట్‌కు 14 రెట్లు ఎక్కువ లాభాలను మరియు కలెక్షన్లను రాబట్టిందని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఈ చిత్రం సుమారు రూ. 14 నుంచి 15 కోట్ల వరకు వసూళ్లను సాధించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును సృష్టించిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఇక ఈ సినిమా విజయంతో అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ క్రేజ్ తారాస్థాయికి చేరుకుందని, యూనిట్ సభ్యులందరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేదని ఆయన తెలిపారు. సినిమా మేకింగ్ సమయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో తనకున్న అనుబంధం, ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాల్లో ‘మనసంతా నువ్వే’ సినిమా ఎప్పుడూ ముందుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

అప్పట్లో ఈ సినిమా పాటలు (ఆర్పీ పట్నాయక్ సంగీతం), ఎమోషనల్ సీన్లు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో వంద రోజులకు పైగా ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. ఉదయ్ కిరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
చలికి పెదాలు పగిలిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో సాఫ్ట్‌ అవుతాయి
చలికి పెదాలు పగిలిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో సాఫ్ట్‌ అవుతాయి
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డిసెంబర్ 31 వరకు ఛాన్స్..
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డిసెంబర్ 31 వరకు ఛాన్స్..
ఇడ్లీలు, పూరీలు వదిలేయండి..15 నిమిషాల్లో చేసుకునే హెల్తీ ఫుడ్ ఇది
ఇడ్లీలు, పూరీలు వదిలేయండి..15 నిమిషాల్లో చేసుకునే హెల్తీ ఫుడ్ ఇది
మంగళవారం కొత్త పనులు ప్రారంభించకూడదా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
మంగళవారం కొత్త పనులు ప్రారంభించకూడదా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
బొద్దింకలు, ఎలుకల వ్యర్థాల నడుమ వంటలు.. 700 కిలోల కుళ్లిన ఫుడ్..
బొద్దింకలు, ఎలుకల వ్యర్థాల నడుమ వంటలు.. 700 కిలోల కుళ్లిన ఫుడ్..
ఆ హీరో చూపించే ప్రేమ వేరు.. ఆయనలోనే నాన్నను చూసుకుంటున్నా..
ఆ హీరో చూపించే ప్రేమ వేరు.. ఆయనలోనే నాన్నను చూసుకుంటున్నా..
లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం!
లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం!
సినిమాలు వద్దనుకుని బుల్లితెరపైనే సెటిల్ అయ్యా..
సినిమాలు వద్దనుకుని బుల్లితెరపైనే సెటిల్ అయ్యా..
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి