Thaman: ఆ హీరో చూపించే ప్రేమ, ఆప్యాయత వేరు.. ఇప్పుడు ఆయనలోనే నాన్నను చూసుకుంటున్నా: తమన్
సంగీత సంచలనం తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు మొదలుకుని అఖిల్ అక్కినేని, సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోల సినిమాలకూ తమనే సంగీతం సమకూరుస్తుంటారు. మ్యూజిక్ సంగతి పక్కన పెడితే తమన్ చాలా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు.

ప్రస్తుతం తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ అగ్రస్థానంలో ఉంటారు. సీనియర్ హీరోల సినిమాలు మొదలుకుని యంగ్ హీరోల సినిమాలకు కూడా తమనే ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు. గతేడాది ఓవరాల్ గా 10 సినిమాలకు సంగీతం సమకూర్చారు తమన్. ఇక ఈ ఏడాది ఇప్పటికే తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఈ మ్యూజిక్ సెన్సేషన్ చేతిలో మరో అరడజను సినిమాలున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి కాకా, బాలకృష్ణ దాదా వంటి స్టార్ హీరోల సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలు, సంగీతం పక్కన పెడితే.. తమన్ చాలా చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే ఇప్పుడు ఆ ఆ లోటును బాలకృష్ణ గారు భర్తీ చేస్తున్నారని ఒక సందర్భంలో బాగా ఎమోషనల్ అయ్యాడు తమన్. ‘బాలయ్య చూపించే ప్రేమ, ఆప్యాయత వేరు. ఆయన నాకు ఒక తండ్రిలాగా అండగా నిలుస్తారు. ఎప్పుడూ ధైర్యం చెబుతుంటారు. కలిసినప్పుడల్లా ఆశీర్వదిస్తుంటారు. బాలయ్యతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన చూపించే ఆదరణ ఒక తండ్రి స్థానాన్ని గుర్తుచేస్తుంది. ఆయనను ఎదురుగా చూస్తేనే నాకు తెలియని ఎనర్జీ వస్తుంది. ఆ ఉత్సాహంతోనే ఆయన సినిమాలకు గొప్ప సంగీతం ఇవ్వాలనే కసితో పని చేస్తాను’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బాలయ్య-తమన్ లది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’, ‘అఖండ 2’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మ్యూజిక్, బీజీఎమ్ ల పరంగా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అదే దాదా. గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమనే సంగీతం అందిస్తన్నాడు. ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోని మొదటి పాటకు ‘దాదా ధమాకా’ అనే మాస్ ను నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Thaman, Balakrishna
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




