బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకు ఛాన్స్.. ఈ పని చేయకపోతే ఇబ్బందులే..
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. అయితే ఆర్బీఐ బిగ్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 31వ తేదీ వరకు కేవైసీ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు కూాడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలనే వివరాలను కూడా వెల్లడించింది.

బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ జారీ చేసింది. బ్యాంక్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్‌కు కేవైసీ అప్డేట్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం అక్టోబర్ 21 నుంచి మొదలైన ప్రత్యేక శిబిరాలు డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయని తెలిపింది. మీ సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను సమర్పించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. కేవైసీ అప్డేట్ చేసుకోవడం వల్ల మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుందని, బ్యాంకు సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చని తెలిపింది. కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్‌గా మారడం వల్ల లావాదేవీలు నిర్వహించలేరని పేర్కొంది.
కేవైసీ అప్డేట్ కోసం అవసరమైన పత్రాలు
-కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పులు లేకపోతే(వ్యక్తిగత వివరాలు) స్వీయ ప్రకటన ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోండి
-వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉంటే ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, NREGA జాబ్ కార్డ్, జాతీయ జనాభా రిజిష్టరు ద్వారా జారీ చేయబడిన పత్రం సమర్పించి ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ చేయవచ్చు. ఇందుకోససం ఆన్ లైన్ ద్వారా ఆధార్ ఓటీపీ, వీడియో కేవైసీ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోవడం ఎలా..?
సమీపంలో మీ బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా బ్రాంచ్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్స్(BC) ద్వారా కూడా పూర్తి చేసైుకోవచ్చు.
నకిలీ మెస్సేజులు పట్ల జాగ్రత్త
మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోండంటూ మీ మొబైల్‌కు వచ్చే నకిలీ మెస్సేజుల పట్ల జాగ్రత్తగా ఉండండి. స్పామ్ లింకులు క్లిక్ చేయడం వల్ల మీ అకౌంట్లోని డబ్బులు కోల్పోయే అవకాశముంది. దీంతో వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేేసింది.
కేవైసీ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది..?
ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఒక్కసారి అయినా కేవైసీ అప్డేట్ చేయాలి. ఒకవేళ పూర్తి చేయకపోతే మీ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. దీని వల్ల మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదు. డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడం లాంటివి చేయలేరు. దీని వల్ల మీరు అసౌకర్యానికి గురి కావాల్సి ఉంటుంది. దీంతో కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తోంది.
