LPG Gas Rules: ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండవచ్చా..? కేంద్రం కఠిన రూల్స్.. అలా కుదరదు..
ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే వంటకు ఖచ్చితంగా సిలిండర్ అవసరం. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం రాకుండా ఉండేందుకు కొన్ని పరిమితులు విధిించింది,.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది ప్రతీ వంటింట్లోకి ఖచ్చితంగా అవసరమైన నిత్యావసర వస్తువు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లేనిది వంటింట్లో ఏ పని జరగదు. గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా ముందుగా గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉండాలి. కనెక్షన్ లేకపోతే మీరు గ్యాస్ సిలిండర్లు పొందలేరు. దేశంలో నివసించే ప్రజలందరికీ సక్రమంగా గ్యాస్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రూల్స్ అమలు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లకు, సిలిండర్లకు కొన్ని నిబంధనలు విధించింది. ఇటీవల గ్యాస్ బుకింగ్స్‌కు టైం పీరియడ్ కూడా విధించింది. అదే విధంగా ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండాలనే విషయంపై కూడా పరిమితులు ఉన్నాయి.
ఒక ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండవచ్చా..?
ఒక ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండటానికి అనుమతి లేదు. ఉదాహరణకు భర్త పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రుల పేరుపై తీసుకోలేరు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే ఒక కనెక్షన్ మాత్రమే పొందగలరు. మీకు ఇప్పటికే ఒక కంపెనీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఇతర గ్యాస్ కంపెనీల కనెక్షన్ పొందాలన్నా అనుమతి ఉండదు. అదే ఒకే ఇంట్లో రెండు స్వతంత్ర కుటుంబాలుగా జీవిస్తూ వేరే కిచెన్ కలిగి ఉంటే నిబంధనలు వేరుగా ఉంటాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి మీ పరిస్థితి వివరించాలి. అలాంటప్పుడు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లను మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది నియమ, నిబంధనలకు లోబడి ఉంటుంది. ఒక అడ్రస్‌పై రెండు వేర్వేరు కుటుంబాలుగా జీవిస్తుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. ఒకే వంటగదిని పంచుకుంటుంటే.. ఇండేన్, భారత్, హెచ్‌పీ వంటి వాటిల్లో ఏదైనా ఒకటి మాత్రమే పొందగలరు.
ప్రత్యేక గ్యాస్ కనెక్షన్ ఎప్పుడు తీసుకోవచ్చు..?
ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ అనే రూల్ అమల్లో ఉంది. దీని వల్ల ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల్లో ఒక వ్యక్తిపై గ్యాస్ కనెక్షన్ ఉంటే.. మరో వ్యక్తికి ఇవ్వరు. అయితే వినియోగదారులు డబుల్ బాటిల్ కనెక్షన్ తీసుకోవచ్చు. అంటే ఒకే కనెక్షన్‌పై రెండు సిలిండర్లు అదనంగా తీసుకోవచ్చు. కానీ ఈ రెండు సిలిండర్లు ఒకే కనెక్షన్‌లో భాగంగా ఉంటాయి. రెండు వేర్వురు కుటుంబాలుగా జీవిస్తున్నా, స్వతంత్ర కుటుంబాలుగా ఉన్నా, వేర్వురు వంట గదులు ఉన్నా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. గ్యాస్ ఏజెన్సీల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తారు. గ్యాస్ పంపిణీలో పారదర్శకత కోసం కేంద్రం ఈ నిబంధనలు కఠినతరం చేసింది.
