AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. దీంతో ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి పెరగనుందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
Rains
Venkatrao Lella
|

Updated on: Nov 10, 2026 | 2:26 PM

Share

నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి వాయువ్య ఉత్తరప్రదేశ్ వరకు ఉన్న ద్రోణి.. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో చలి తీవ్రత ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదలైంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి 16 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 14.7 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు అయింనట్లు వాతావరణశాఖ నివేదికలు చెబుతున్నాయి.

ఏపీకి వర్షసూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు8. ఈ నెల 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అయితే ఈ వాయుగుండం తుఫాన్‌గా మారే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తుఫాన్‌గా మారితే ఏపీకి మరో గండం పొంచి ఉన్నట్లు అవుతుంది. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ ప్రభావంతో  ఏపీలో భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల రోడ్లు, విద్యుత్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో ఏపీకి మరిన్ని తుఫాన్లు ముప్పు పొంచి ఉందనే అంచనాలు వాతావరణశాఖ నుంచి వినిపిస్తున్నాయి.

ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడిన  24 గంటల్లో బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, అలల ఉద్ధృతి అధికంగా ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది.  గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అలల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారులు ఈ నెల 14, 15 తేదీల్లో సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

Follow Us