Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మరోసారి సెల్ఫ్ హర్ట్ డ్రామా.. నీతూ ఏంటి ఇలా చేశారు
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వాగ్వాదాలు జరగడం సహజమే. కానీ ఆ గొడవలు శ్రుతిమించి హద్దులు దాటితే మాత్రం నాగార్జున ఏమాత్రం ఊరుకోరు. నిన్నటి ఎపిసోడ్ లో ఇలాంటివి చాలానే జరిగాయి, ముఖ్యంగా నీతూ నటరాజ్ చేసిన పని అందరిని షాక్‌కు గురి చేసింది.

బిగ్ బాస్ ఇంట్లో గొడవలు, వాదోపవాదాలు జరగడం కామన్. అయితే ఆటలో భాగంగా జరిగే వివాదాలు హద్దులు దాటితే మాత్రం హోస్ట్ నాగార్జున సీరియస్ అవుతుంటారు. గతంలో టాస్కులో సరిగ్గా ఆడలేకపోయాననే అసహనంతో వంశీ తన చెంపపై తాను కొట్టుకోవడంతో నాగార్జున గట్టిగానే హెచ్చరించారు. మరోసారి ఇలాంటి పని చేయవద్దని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అదే తరహా ఘటనతో నీతూ మరోసారి చర్చల్లోకి వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఈ క్రమంలో నీతూ తనను తాను చెంపపై కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా రామ్ ప్రసాద్, వర్షిణి మధ్య స్నేహం గురించి చర్చ మొదలవుతుంది. మనం స్నేహితులం కదా.. ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కకు పిలిచి మాట్లాడొచ్చు కదా.? ఇలా కార్డుపై రాయడం ఏంటని రామ్ ప్రసాద్ ప్రశ్నిస్తాడు. దీనికి స్పందించిన వర్షిణి స్నేహం ఉన్నంత మాత్రాన నెగెటివ్ పాయింట్లు చెప్పకూడదని ఏమీ లేదని సమాధానం ఇస్తుంది. మరోవైపు త్రిగుణ్ వ్యవహారశైలిపై నీతూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. తనతో బాగుంటే ఒకలా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు వేధిస్తారని ఆరోపిస్తుంది. ఇక సుధీర్ విషయంలో వర్షిణి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. మిత్రలాభం, మిత్రభేదం గురించి మాట్లాడుతూ సుధీర్ తనకు ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేశాడనే అర్థం వచ్చేలా కామెంట్ చేస్తుంది.
ఇక నీతూ, త్రిగుణ్ మధ్య నామినేషన్ పాయింట్ల విషయంలో పెద్ద గొడవే జరుగుతుంది. ఒకరి మాట మరొకరు వినకుండా మధ్యలోనే అడ్డుకోవడంతో వాదన ముదురుతుంది. పాయింట్‌కు రమ్మని నీతూ చెప్పగా, తన మాట పూర్తయ్యే వరకు మాట్లాడనివ్వాలని త్రిగుణ్ అంటాడు. ఈ క్రమంలో వంశీ కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది. త్రిగుణ్‌పై నీతూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, దానికి వంశీ కౌంటర్లు ఇవ్వడం జరిగింది. నీకు మెంటలా.? అన్నట్టుగా నీతూ మాట్లాడటంతో వంశీ కూడా ఘాటుగా స్పందిస్తాడు. పక్కనే మెడికల్ రూమ్ ఉందని, కావాలంటే పరీక్షించుకోవచ్చనే అర్థంలో వ్యాఖ్యానిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతుంది.
ఇదిలా ఉంటే సుధీర్, వర్షిణి మధ్య కూడా పాత విషయాలు మళ్లీ తెరపైకి వస్తాయి. ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయామనే విధంగా మాట్లాడుకుంటారు. మరోవైపు కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల ప్రస్తావన రావడంతో నీతూ మరింత ఆగ్రహానికి గురవుతుంది. త్రిగుణ్ తన కుటుంబ కష్టాల గురించి మాట్లాడుతుండగా నీతూ అతడిని జోకర్ అంటుంది. అయితే ఈ వాగ్వాదం మధ్యలో నీతూ ఒక్కసారిగా తన చెంపపై తాను కొట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో వంశీ విషయంలో నాగార్జున ఇదే అంశంపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నీతూ కూడా చేయడంతో వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎంతవరకు వెళ్లినా తమను తాము గాయపరుచుకోవడం సరైన పద్ధతి కాదని నాగార్జున మరోసారి క్లాస్ తీసుకుంటారా.? నీతూకు గట్టిగా వార్నింగ్ ఇస్తారా.? లేక ఈ గొడవ వెనుక ఉన్న కారణాలను కూడా ప్రస్తావిస్తారా.? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
