AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..’ పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల విడాకుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పిల్లల భవిష్యత్తు, సంతోషమే తమ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు..

'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా కొణిదెల విడాకుల ప్రకటన
Pawan Kalyan Anna Konidela Divorce
Srilakshmi C
|

Updated on: Nov 10, 2026 | 6:44 AM

Share

అమరావతి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగిన తమ వివాహ బంధం నుంచి విడిపోవాలని పరస్పర అవగాహన, గౌరవంతో నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సోమవారం (నవంబర్ 9) రాత్రి ఈ ప్రకటన వెలువడటంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపామని, ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని అందులో పేర్కొన్నారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. తమ పిల్లలకు అంకితమైన తల్లిదండ్రులుగా బాధ్యతలను నిర్వర్తిస్తామని తెలిపారు. పిల్లల సంతోషం, సంక్షేమమే తమ ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యతగా ఉంటుందని వెల్లడించారు. ఈ వ్యక్తిగత పరిణామం సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. తమ ప్రయాణంలో ఇన్నాళ్లూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

విడిపోవడానికి కారణమేంటి?

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో వెల్లడించలేదు. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి వివరాలు కూడా అందులో ప్రస్తావించలేదు. అలాగే విడాకుల చట్టపరమైన ప్రక్రియ, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా సమాచారం. ఈ చట్టపరమైన అంశాలపై మరింత అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Pawan Kalyan Announces Divorce

‘తీన్ మార్’ సినిమా సమయంలో పరిచయం

పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా పరిచయం ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడింది. 2011లో విడుదలైన ఈ సినిమాలో అన్నా కూడా నటించారు. పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో 2013 సెప్టెంబర్‌లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత అన్నా కొణిదెల ఎక్కువగా కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కుటుంబానికి అండగా నిలిచారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె పేరు పొలెనా అంజనా పవనోవా కాగా, కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.

Follow Us
హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? క్లారిటీ ఇచ్చేశాడు
హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? క్లారిటీ ఇచ్చేశాడు
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
'పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం..' పవన్ కల్యాణ్ - అన్నా విడాకులు
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు