AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్గురు పిల్లల తల్లిని అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపిన ప్రియుడు!

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. ఊత్తుకోట సమీపంలోని అటవీ ప్రాంతంలో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. మృతురాలిని సెంగరై గ్రామానికి చెందిన మణిమేఖలగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ముగ్గురు పిల్లల తల్లిని అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపిన ప్రియుడు!
Murdered In Tiruvallur
Balaraju Goud
|

Updated on: Nov 10, 2026 | 8:00 AM

Share

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. ఊత్తుకోట సమీపంలోని అటవీ ప్రాంతంలో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. మృతురాలిని సెంగరై గ్రామానికి చెందిన మణిమేఖలగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుర్గా ప్రసాద్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు కారణమైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ముగ్గురు పిల్లలతో పుట్టింట్లో నివాసం

మణిమేఖలకు ఆంధ్రప్రదేశ్‌లోని సురుటపల్లి సమీపంలోని కారణి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె భర్త నుంచి విడిపోయింది. ముగ్గురు పిల్లలతో కలిసి తిరువళ్లూరు జిల్లా సెంగరైలోని పుట్టింట్లో నివసిస్తోంది.

ఈ క్రమంలో తేర్వాయ్ కండిగై సిప్‌కాట్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుర్గా ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధానికి దారితీసినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా మణిమేఖల తరచూ డబ్బులు అడుగుతూ ఇబ్బంది పెడుతోందని, ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

మాట్లాడుకుందామని తీసుకెళ్లి హత్య

ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకుందామని మాట్లాడాలంటూ దుర్గా ప్రసాద్ మణిమేఖలను నమ్మించాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరువళ్లూరు జిల్లా పూండి సమీపంలోని సెండ్రాయన్‌పాళయం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే తన వద్ద దాచుకున్న కత్తితో మణిమేఖలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడి అరెస్ట్.. పోలీసుల విచారణ

మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పెన్నలూరుపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు దుర్గా ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మణిమేఖల తరచూ డబ్బులు అడుగుతూ ఇబ్బంది పెట్టేదని, తనను ఎగతాళి చేస్తూ మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కోపంతోనే ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.

ముగ్గురు చిన్నారులకు తల్లిని దూరం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హత్య వెనుక ఉన్న ఇతర కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us