AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న కోరిక తీరలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు .. నిండు ప్రాణాలను తీసుకున్నాడు.. ఈ షాకింగ్ కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామంలో జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
Crime News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 7:11 PM

Share

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న కోరిక తీరలేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు .. నిండు ప్రాణాలను తీసుకున్నాడు.. ఈ షాకింగ్ కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామంలో జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల ప్రకారం.. గోపాలపూర్ గ్రామానికి చెందిన రిత్విక్ (17) అనే బాలుడు చదువుకుంటూ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. అయితే ప్రస్తుతం పంట సాగు కొనసాగుతున్నందున చేతిలో డబ్బులు లేవని, పంట డబ్బులు వచ్చిన వెంటనే బైక్ కొనిస్తానని తండ్రి అతడిని నచ్చజెప్పాడు.

అయితే, అడిగిన వెంటనే బైక్ కొనివ్వలేదనే రిత్విక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదనలో ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆశతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన రిత్విక్ చివరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొద్దిరోజులు ఆగితే బైక్ కొనిస్తానని చెప్పినా వినలేకపోయాడు అంటూ.. తల్లిదండ్రులు వినిపిస్తున్న తీరు అందర్నీ కలచి వేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చేసింది 9 సినిమాలు.. అన్ని ఫ్లాపే..!
చేసింది 9 సినిమాలు.. అన్ని ఫ్లాపే..!
అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..
అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..
రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని..
రుత్విక్ ఇలా చేస్తడనుకోలేదు.. బైక్ కొనివ్వలేదని..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..