Video: బావిలో ఈతకొట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే.. యువకులతో కలిసి ఎంజాయ్ చేసిన అనిరుధ్ రెడ్డి..
రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ కామెంట్స్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ఒక్కసారిగా రూట్ మార్చారు. కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సామాన్య యువకుడిలా బావిలోకి దూకి ఈతకొట్టారు. స్థానిక యువకులతో పోటీ పడుతూ ఆయన చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలోని కావేరమ్మపేట సమీపంలో ఉన్న పురాతన గచ్చు బావి కనిపించింది. దీంతో వెంటనే తన కాన్వాయ్‌ను అటు వైపునకు తిప్పించారు. పురాతన గచ్చు బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ కొంతమంది యువకులు ఈత కొడుతూ కనిపించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం వారితో జతకట్టారు. నీటిలో దుంకుతూ… కేరింతలు కొడుతూ యువకుడిలా మారిపోయారు. ఈత కొడుతున్న యువకులతో పోటీ పడుతూ ఎంజాయ్ చేశారు.
ఇక ఈత అనంతరం వందల ఏళ్ల చరిత్ర కలిగిన గచ్చు బావి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తక్షణమే తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.20లక్షలను గచ్చు బావి పునరుద్ధరణకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నిత్యం హాట్ హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒక్కసారిగా బావిలో ఈత కొట్టడం ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే హాఠాత్తుగా వచ్చి బావిలో ఈత కొడుతుండడంతో స్థానికులు, యువకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బిజీబిజీ షెడ్యూల్‌తో హడావిడిగా ఉండే ఎమ్మెల్యే ఉల్లాసంగ గడపడాన్ని ఆయన సిబ్బంది సైతం ఆసక్తిగా గమనించారు.
