కుర్రాళ్ళ లేటెస్ట్ క్రష్ .. అదరగొడుతున్న పాయల్ రాధాకృష్ణ 

Rajeev 

24 April 2026

instagram

యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ.  కన్నడ, తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ

 మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం నటిగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది పాయల్. 

 ఈ ముద్దుగుమ్మ  2017లో వచ్చిన కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్ అనే సినిమాతోవెండితెరకు పరిచాయమైంది.

ఇక తెలుగులోకి  'తరగతి గది దాటి' అనే వెబ్ సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాధాకృష్ణ

 తెలుగులో అలా నిన్ను చేరి, ప్రసన్నవదనం, చౌర్య పాఠం సినిమాల్లో నటించింది. ఈ చిన్నది నటనకు మంచి మార్కులు పడ్డాయి.

రీసెంట్ గా పాపం ప్రతాప్ లో నటించింది. తిరువీర్ సరసన నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. 

దాంతో ఇప్పుడు ఈ బ్యూటీ పేరు టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ క్రష్ అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.