Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ ప్రెజర్ ఫీలవుతున్నారా ??
రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏమిటనేది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మాస్త్ర సీక్వెల్, సంజయ్ లీలా భన్సాలీ చిత్రం, అలాగే ధూమ్ 4 రేసులో ఉన్నాయి. రామాయణ విడుదల తర్వాత, బ్రహ్మాస్త్ర 2కే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆ తర్వాత ధూమ్ 4 రావచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆయన నిర్ణయంపై భారీ అంచనాలున్నాయి.
రణ్‌బీర్ మీద ఇప్పుడు ప్రెజర్ మామూలుగా లేదు. సక్సెస్‌లో ఉన్నామని హ్యాపీగా ఫీలవ్వాలా? ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా చేస్తున్నామని ఎగ్జయిట్ అవ్వాలా? అని ఆలోచించుకునే తీరిక కూడా లేదు. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వెంటాడుతోందట మిస్టర్ రణ్బీర్‌ని. నిజమేగా.. ఇంతకీ వాట్ నెక్స్ట్ ఇప్పుడు? రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అయితే, నెక్స్ట్ పార్ట్ వచ్చే దీపావళికల్లా రెడీ కావాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ షూట్స్, షెడ్యూల్స్ కంపల్సరీ అన్నమాట. ఈ సినిమా సంగతి సరే, మరి దీని తర్వాత రణ్‌బీర్ ఏం చేస్తారన్నదే ఇప్పుడు థౌజండ్ డాలర్స్ ప్రశ్న. ఆఫ్టర్ రామాయణ బ్రహ్మాస్త్ర సీక్వెల్‌ని లైన్లో పెడతామని ఈ మధ్యనే ప్రొడ్యూసర్ ఓపెన్ అయ్యారు. అంతలోనే సంజయ్ లీలా భన్సాలీ మూవీ చేయాలి. రామాయణతో పాటు సంజయ్ లీలా భన్సాలీ సినిమా కంప్లీట్ చేసే సరికి చాలా టైమ్ పడుతుంది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సెట్‌కి వెళ్తారా? ధూమ్ 4 సెట్స్ ని ఛూజ్ చేసుకుంటారా? రెండూ ప్రెస్జీయిస్ ప్రాజెక్టులే అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. అయితే, బ్రహ్మాస్త్ర ప్రొడ్యూసర్ ముందే ఓపెన్ అయ్యారు కాబట్టి అటు వెళ్లే ఛాన్సులే ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ నెక్స్టే ధూమ్ ఫ్రాంఛైజీ ఉండొచ్చనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

