AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,28,7,15,7,19,22.. ఏడు మ్యాచ్‌లు 104 పరుగులు.. చెన్నై టీంకు శాపంగా మారిన తోపు ప్లేయర్..!

Chennai Super Kings: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ మాత్రం యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ముంబై ఇండియన్స్‌పై భారీ విజయం సాధించినా, ఓపెనర్‌గా గైక్వాడ్ మరోసారి విఫలం కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడు మ్యాచ్‌ల్లో ఆయన ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

6,28,7,15,7,19,22.. ఏడు మ్యాచ్‌లు 104 పరుగులు.. చెన్నై టీంకు శాపంగా మారిన తోపు ప్లేయర్..!
Csk Ipl 2026
Venkata Chari
|

Updated on: Apr 24, 2026 | 8:00 PM

Share

Chennai Super Kings: గురువారం జరిగిన రసవత్తర పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను 103 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. జట్టు మొత్తం సమష్టిగా రాణించినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కేవలం 14 బంతుల్లో 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. అల్లా గజన్‌ఫర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో, ఒక స్టార్ ఓపెనర్‌గా ఆయన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గైక్వాడ్ వైఫల్యం జట్టు బ్యాటింగ్ ఆరంభాన్ని బలహీనపరుస్తోంది.

ఐపీఎల్ 2026లో అత్యంత పేలవమైన ఓపెనర్..

ప్రస్తుత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గణాంకాలు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఈ ఏడాది ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో ఆయన వరుసగా 6, 28, 7, 15, 7, 19, 22 పరుగులు మాత్రమే చేశారు. అంటే మొత్తం 7 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 104 పరుగులు మాత్రమే సాధించాడు. ఆయన సగటు కేవలం 14.86గా ఉండటం విశేషం. కనీసం ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ఓపెనర్లలో అత్యంత తక్కువ సగటు కలిగిన ఆటగాడిగా గైక్వాడ్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆయన స్ట్రైక్ రేట్ కూడా 120 లోపే ఉండటం గమనార్హం.

సంజూ శామ్సన్ రూపంలో పొంచి ఉన్న ముప్పు..

ఒకవైపు గైక్వాడ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, అదే జట్టులో సంజూ శామ్సన్ పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. శామ్సన్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 58.60 సగటుతో ఏకంగా 293 పరుగులు చేశాడు. ఇందులో రెండు మెరుపు శతకాలు కూడా ఉండటం విశేషం. శామ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, వచ్చే సీజన్ నాటికి చెన్నై జట్టు నాయకత్వ బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నాడు. 31 ఏళ్ల శామ్సన్ నాయకత్వ లక్షణాలు కూడా గైక్వాడ్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.

కెప్టెన్సీపై పెరుగుతున్న ఒత్తిడి..

రుతురాజ్ గైక్వాడ్ గతంలో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, ప్రస్తుత ఫామ్ ఆయన కెప్టెన్సీని ప్రశ్నార్థకం చేస్తోంది. జట్టు విజయం సాధిస్తున్న తరుణంలో ఆయన వైఫల్యాలు బయటకు కనిపించకపోయినా, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓపెనర్ విఫలమైతే జట్టు మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి రానున్న మ్యాచ్‌ల్లోనైనా ఈ ‘సూపర్ స్టార్’ ఫామ్ పుంజుకుంటారో లేక చెన్నై నాయకత్వ మార్పు దిశగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us