AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిస్క్ ఫ్రాక్చర్‌తో కెరీర్ క్లోజ్ అవ్వాల్సినోడు.. గిల్ అండతో మారిన ఫ్యూచర్.. భారత జట్టులోకి ఎంట్రీ..!

Gurnoor Brar Test Debut: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన జట్టులో ఒక అనూహ్యమైన పేరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పంజాబ్ మట్టి నుంచి పుట్టుకొచ్చిన 25 ఏళ్ల యువ పేస్ సంచలనం గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ, గాయాల గాయాలను అధిగమించి అతడు సాధించిన ఈ విజయం వెనుక ఎంతో భావోద్వేగం ఉంది.

డిస్క్ ఫ్రాక్చర్‌తో కెరీర్ క్లోజ్ అవ్వాల్సినోడు.. గిల్ అండతో మారిన ఫ్యూచర్.. భారత జట్టులోకి ఎంట్రీ..!
Shubman Gill Friend Gurnoor Brar
Venkata Chari
|

Updated on: May 19, 2026 | 6:11 PM

Share

Shubman Gill Friend Gurnoor Brar: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీం ఇండియా సెలెక్షన్ కమిటీ మే 19న ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు గుర్నూర్ బ్రార్. ఆరు అడుగులకుపైగా ఎత్తున్న ఈ పంజాబ్ యువకుడు, గంటకు 140 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులను విసరడం ఇతని ప్రత్యేకత. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతూ సెలెక్టర్ల కంట్లో పడ్డాడు. కేవలం 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే ఏకంగా 52 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం, పిచ్ నుంచి అదనపు బౌన్స్ సాధించడం గుర్నూర్ బ్రార్‌కు ఉన్న అతిపెద్ద బలం. ఈ పదునైన అస్త్రాలతోనే ఇప్పుడు ఆఫ్ఘన్ బ్యాటర్లను వణికించడానికి సిద్ధమయ్యాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో విడదీయరాని స్నేహం..

గుర్నూర్ బ్రార్ క్రికెట్ ప్రస్థానంలో ప్రస్తుత భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పాత్ర చాలా కీలకమైనది. వీరిద్దరూ అండర్-19 రోజుల నుంచే ప్రాణ స్నేహితులు. గుర్నూర్‌లో ఉన్న అసాధారణ వేగాన్ని మొదట గుర్తించింది గిళ్లే. ఆ ప్రతిభను గుర్తించి పంజాబ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో అతడికి అవకాశం దక్కేలా గిల్ ఎంతో మద్దతుగా నిలిచాడు. పంజాబ్ క్రికెట్ సర్కిల్‌లో గుర్నూర్ ఎదగడానికి గిల్ అడుగడుగునా మార్గదర్శిగా వ్యవహరించాడు. ఇప్పుడు అదే స్నేహితుడు కెప్టెన్‌గా ఉన్న జట్టులోనే గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేయబోతుండటం విశేషం. అయితే ఇది కేవలం స్నేహం వల్ల వచ్చిన అవకాశం కాదు, తన అద్భుతమైన ప్రతిభతోనే గుర్నూర్ భారత జర్సీని సంపాదించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

గాయం నేర్పిన పాఠం.. ఆశిష్ నెహ్రా ఇచ్చిన పునరుజ్జీవం..

గుర్నూర్ బ్రార్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2023లో అతడి కెరీర్‌ను ముగించేంతటి తీవ్రమైన డిస్క్ ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరమై తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా శుభ్‌మన్ గిల్ అతడికి అండగా నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత గుర్నూర్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా పంపడంలో గిల్ సహాయపడ్డాడు. అక్కడే భారత మాజీ దిగ్గజ పేసర్ ఆశిష్ నెహ్రా కన్ను గుర్నూర్‌పై పడింది. నెహ్రా పర్యవేక్షణలో గుర్నూర్ తన బౌలింగ్ శైలిని మరింత పదును పెట్టుకున్నాడు. ఈ అసాధారణ ప్రతిభను చూసే 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకుంది.

కఠినమైన శ్రమ, స్నేహితుడి నమ్మకం, గురువు మార్గదర్శకత్వం కలగలిసి గుర్నూర్ బ్రార్‌ను ఈరోజు భారత టెస్ట్ జట్టు ముంగిట నిలబెట్టాయి. గాయాల నుంచి కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ మరింత బలమైన ఆటగాడిగా మారిన గుర్నూర్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించడానికి సర్వసజ్జతుడయ్యాడు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ పంజాబ్ ఎక్స్‌ప్రెస్‌కు తెలుగు క్రీడాభిమానుల తరఫున హార్దిక శుభాకాంక్షలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?మీ పొట్ట ప్రమాదంలో
ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?మీ పొట్ట ప్రమాదంలో