AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!

ఇళ్లలో రాత్రి పూట కొద్దిగా అన్నం మిగిలిపోవడం చాలా సాధారణం. ఆ అన్నాన్ని చాలామంది పారేస్తుంటారు లేదా మరుసటి రోజు ఉదయం పులిహోర, ఎగ్ రైస్ వంటివి చేస్తుంటారు. అయితే, వీటన్నింటికీ భిన్నంగా మిగిలిపోయిన అన్నంతో నిల్వ ఉండేలా ఎంతో రుచికరమైన, కరకరలాడే అన్నం వడియాలు తయారు చేసుకోవచ్చు. ఇది మన అమ్మమ్మల కాలం నాటి పొదుపు చిట్కా. మార్కెట్లో దొరికే కల్తీ స్నాక్స్ కొనే బదులు, ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా వీటిని సిద్ధం చేసుకోవచ్చు.

రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు చేసుకోండిలా!
Crispy and Tasty Rice Vadiyalu
Jyothi Gadda
|

Updated on: May 19, 2026 | 7:45 PM

Share

రాత్రి పూట అన్నం మిగిలిపోతే పారేయకుండా లేదా రొటీన్‌గా పులిహోర చేయకుండా, ఎంతో రుచికరమైన అన్నం వడియాలు తయారు చేసుకోవచ్చు. ఇది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా. దీని కోసం మిగిలిన అన్నాన్ని నీళ్లలో మెత్తగా ఉడికించి, అందులో టమాటో పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్‌పై చిన్న చిన్న వడియాలుగా ఒత్తుకుని, ఎండలో రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టాలి. పప్పు, సాంబార్ అన్నంలోకి నంజుకోవడానికి లేదా సాయంత్రం స్నాక్‌గా నూనెలో వేయించుకుని తినడానికి ఈ కరకరలాడే వడియాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: మిగిలిన అన్నం (1 కప్పు), నీళ్లు (1 కప్పు), టమాటో పేస్ట్ (అర కప్పు), జీలకర్ర (పావు టీస్పూన్), నువ్వులు (అర టీస్పూన్), కారం పొడి (అర టీస్పూన్), పసుపు (కొద్దిగా), కొత్తిమీర తరుగు, మరియు రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం: మొదట స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి మరగబెట్టాలి. నీళ్లు మరిగాక అందులో ఒక కప్పు మిగిలిన అన్నం వేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం మెత్తబడిన తర్వాత అందులో అరకప్పు టమాటో పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ అన్నం మిశ్రమం బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి.

ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్‌ను ఎండలో పరుచుకుని, చేతులకు కొద్దిగా నీరు తడి చేసుకుంటూ, ఈ అన్నం మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న పాపడాలు లేదా వడియాల లాగా కవర్‌పై ఒత్తుకోవాలి. వీటిని మంచి ఎండలో రెండు నుండి మూడు రోజుల పాటు రెండు వైపులా తిప్పుతూ బాగా ఎండబెట్టాలి. గలగలా శబ్దం వచ్చేలా ఎండిన వడియాలను ఒక ఎయిర్ టైట్ డబ్బాలో భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా నిల్వ ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us