AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌స్టార్ కృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదంటే.? హీరోను అస్సలు ఊహించలేరు

సూపర్ స్టార్‌గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న హీరో కృష్ణ, తన కెరీర్ ఆరంభంలో విలన్‌గా నటించారన్న విషయం మీకు తెలుసా? 'ప్రైవేట్ మాస్టర్' సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, ఆ సినిమా ఫలితం ఆయన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో ఇక్కడ తెలుసుకుందామా..

Ravi Kiran
|

Updated on: Apr 24, 2026 | 7:02 PM

Share
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సూపర్ స్టార్’ అంటే మన అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఘట్టమనేని కృష్ణ. ‘తేనె మనసులు’ చిత్రంతో హీరోగా పరిచయమై, వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియదు. అప్పట్లో ఒక నటుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే వరుస అవకాశాలు ఉండాలి, లేదంటే సైడ్ క్యారెక్టర్లు లేదా విలన్ పాత్రలు చేయక తప్పని పరిస్థితి ఉండేది.

1 / 5
కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ కృష్ణ విలన్‌గా నటించారంటే నమ్మశక్యం కాదు కదా! సాధారణంగా ఒక నటుడు విలన్‌గా ముద్ర పడితే మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ ‘ప్రైవేట్ మాస్టర్’ అనే సినిమాలో ఆయన నెగటివ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1967 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా విశేషాలు ఇవిగో..

2 / 5
సినిమా హిట్ అయితే విలన్ ఇమేజ్ పడిపోతుందని భయపడే రోజుల్లో, తన నటనను నిరూపించుకోవడానికి కృష్ణ వెనకాడలేదు. విలన్‌గా ఆయన వేసిన ఆ అడుగు ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన చర్చగా మిగిలిపోయింది. ఇక ఈ సినిమాలో రామ్మోహన్ హీరోగా నటించారు. దీనికి కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించారు.

3 / 5
సూపర్ స్టార్ కృష్ణ అదృష్టం కొద్దీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకవేళ అది హిట్ అయ్యుంటే మనం ఈ గొప్ప సూపర్ స్టార్‌ను విలన్ పాత్రల్లోనే చూసేవాళ్లమేమో! అందుకే ఆ ఫ్లాప్ ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు అయ్యింది. ఆ తర్వాత గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆపై మీకు తెలిసిందే.

4 / 5
ఎన్ని పాత్రలు చేసినా సూపర్ స్టార్ కృష్ణ స్టైల్, నడక, నవ్వు మనందరికీ ప్రత్యేకం. అందుకే ఆయనను అందరూ మనసున్న మనిషిగా, సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా గౌరవిస్తారు. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు ఈయన. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సూపర్ స్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా