AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Trains: బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై మరో బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటి పనులను ప్రారంభించేందుకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. అయితే ఏకకాలంలో అనుమతుల కోసం కొత్త వ్యవస్థను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.

Venkatrao Lella
|

Updated on: Apr 24, 2026 | 8:08 PM

Share
దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లను ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మొట్టమొదటి రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య తిప్పనున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఇది తిరగనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రెట్టింపు అయింది. అయితే దేశవ్యాప్తంగా ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

1 / 5
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థల నుంచి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు రైల్వేబోర్డు కృషి చేస్తోంది. మిషన్ మోడ్‌లో వీటిని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారుల నుండి సమగ్ర అనుమతులు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని వల్ల భూసేకరణ, రైట్ ఆఫ్ వే క్లియరెన్స్ ప్రక్రియలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

2 / 5
ఇక భవిష్యత్ బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ కోసం డిజైన్లను ప్రామాణీకరించడం వల్ల కీలకమైన రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ పరికరాల వంటి నిర్మాణ సరఫరాకు అంతరాయం ఉండదని రైల్వేశాఖ భావిస్తోంది. సివిల్ పనుల కోసం ప్రీ-కాస్ట్ వ్యవస్థలను అవలంభించడం వల్ల కూడా పనులను వేగవతం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో అనుమతులు పొందటంలో బుల్లెట్ రైళ్ల కారిడార్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

3 / 5
అహ్మదాబాద్-ముంబై మధ్య తొలి బుల్లెట్ రైలు కారిడార్ నిర్మిస్తు్న్నారు. మొదట్లో భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం జరగడం వల్ల జాప్యం జరిగింది. దీని వల్ల ముందుగా నిర్దేశించుకున్న కాలపరిమితిలో దీనిని ప్రారంభించలేకపోయారు. దీంతో ప్రాజెక్ట్ వ్యయం రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్ల వరకు పెరిగింది.  భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు.

4 / 5
ముంబై-అహ్మదాబాద్‌తో పాటు పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ఈ కారిడార్లు పూర్తయితే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల నగరాల మధ్య ప్రయాణం వేగవంతం కానుంది.

5 / 5
Follow Us